Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sankalp Reddy: సంకల్ప్ రెడ్డి నిర్మించిన ‘IB 71’ రిలీజ్ డేట్ వచ్చింది!

Sankalp Reddy: సంకల్ప్ రెడ్డి నిర్మించిన ‘IB 71’ రిలీజ్ డేట్ వచ్చింది!

  • April 25, 2023 / 06:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sankalp Reddy: సంకల్ప్ రెడ్డి నిర్మించిన ‘IB 71’ రిలీజ్ డేట్ వచ్చింది!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో సంకల్ప్ రెడ్డి ఒకరు. ‘ఘాజీ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంకల్ప్.. ఇండియాస్ ఫస్ట్ సబ్ మెరైన్ సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసాడు. ఇండో-పాక్ మధ్య జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించిన ఈ అండర్ వాటర్ వార్ బేస్డ్ మూవీతో నేషనల్ అవార్డ్ అందుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రూపొందించిన ‘అంతరిక్షం 9000 KMPH’ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టినప్పటికీ.. లిమిటెడ్ బడ్జెట్ తో హై క్వాలిటీ సినిమా తీయగల దర్శకుడని అనిపించుకున్నాడు.

ఈ క్రమంలో ‘పిట్ట కథలు’ అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్.. ఇప్పుడు ‘ఐబీ 71’ అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. ‘ఐబీ 71’ సినిమాలో బాలీవుడ్స్ యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్ హీరోగా నటిస్తున్నాడు. ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌ కి సంబంధించిన రియ‌ల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సమ్మర్ స్పెషల్ గా మే 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సినిమా ట్రైలర్ ను సోషల్ మీడియాలో విడుదల చేసారు. 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో భారతదేశం విజయం వెనుక ఉన్న సీక్రెట్ మిషన్‌ ఆధారంగా ‘ఐబీ 71’ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. ఇందులో విద్యుత్ జమ్వాల్ ఒక ఇండియన్ ఎయిర్ పోర్స్ ఆఫీసర్ గా నటించాడు. పాకిస్తాన్ , చైనాలు కలిసి మన దేశంపై ప్లాన్ చేసిన దాడిని నిరోధించడానికి ఏజెంట్లు ఏం చేసారు? శత్రువులను ఎలా మట్టుబెట్టారు? అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు.

సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, విశాల్ జెత్వా తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ‘ఐబీ 71’ అనేది భారతదేశపు మోస్ట్ కాన్ఫిడెన్షియల్ మిషన్ అని చిత్ర బృందం చెప్పింది. ”30 మంది ఏజెంట్స్.. 10 రోజులు.. 50 ఏళ్లుగా ఇండియన్ హిస్టరీలో దాగి ఉన్న ఒక అత్యంత రహస్య మిషన్ ఇది. 1971 ఇండో-పాక్ యుద్ధంలో మనల్ని గెలిపించేలా చేసిన అపురూపమైన నిజమైన స్టోరీని చూడండి. ఇది ఒక దేశభక్తి స్పై థ్రిల్లర్.

Sankalp Reddy signed for a bollywood project1

ఐబీ ఏజెంట్ దేవ్ జమ్‌వాల్ (విద్యుత్ జమ్‌వాల్) దేశాన్ని రక్షించడానికి సీక్రెట్ మిషన్‌ లో ఉన్న వాస్తవ సంఘటనల ఆధారంగా చెప్పబడిన కథ” అని పేర్కొన్నారు. ఇకపోతే ‘IB 71’ సినిమాతో విద్యుత్ జమ్‌వాల్ ప్రొడ్యూసర్ గా మారుతున్నాడు. యాక్షన్ హీరో ఫిల్మ్స్ అనే బ్యానర్ ను స్థాపించిన బాలీవుడ్ హీరో.. T-సిరీస్ ఫిల్మ్స్ & రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో భూషణ్ కుమార్, అబ్బాస్ సయ్యద్ లతో కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథ అందించిన ఆదిత్య శాస్త్రితో పాటుగా ఆదిత్య చౌక్సే, శివ చననా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sankalp Reddy
  • #IB 71
  • #Sankalp Reddy

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

7 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

9 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

15 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

1 day ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

1 day ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

1 day ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version