శరణ్య ప్రదీప్.. టాలీవుడ్లో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఈమె కూడా ఒకరు. ‘ఫిదా’ సినిమాలో సాయి పల్లవి అక్క పాత్రలో పక్కా తెలంగాణ అమ్మాయిగా ఈమె కనపరిచిన నటన ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ సినిమా తర్వాత ఈమెకు బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. ‘శైలజారెడ్డి అల్లుడు’ ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’ ‘దొరసాని’ ‘మిస్ మ్యాచ్’ ‘జాను’ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ ‘తెల్లవారితే గురువారం’ ‘పుష్పక విమానం’ ‘మిషన్ ఇంపాసిబల్’ ‘రెక్కీ’ ‘ది వారియర్’ ‘ఖుషి’ ‘మార్టిన్ లూథర్ కింగ్’ వంటి సినిమాల్లో నటించింది.
పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు, అందరి ఇళ్లల్లో ఉండే అక్క పాత్రలు ఈమెకు బాగా సెట్ అవుతాయి. అలాంటి పాత్రలకి తన వంతు హానెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తూనే ఉంది శరణ్య ప్రదీప్. కానీ ‘ఫిదా’ రేంజ్లో ఈమెకి సరైన పాత్ర పడలేదు అని ఎక్కువ మంది కామెంట్లు చేస్తూ ఉంటారు. దర్శకులు కూడా ఈమెలో మంచి నటిని సరిగా వాడలేదు అనే ఫీలింగ్ కూడా అందరికీ కలిగే ఉంటుంది.
అయితే ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా దర్శకుడు దుష్యంత్ మాత్రం శరణ్యలో దాగున్న నటిని కంప్లీట్ గా బయటపెట్టాడు అని చెప్పాలి. అవును శరణ్య ప్రదీప్ గురించి ఇక నుండి చెప్పుకోవాలి అంటే ‘ ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ కి ముందు..’ ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’.. కి తర్వాత’ అని చెప్పుకోవాలి. అంతలా అద్భుతమైన నటన కనపరిచింది శరణ్య. కొన్ని సన్నివేశాల్లో అయితే హీరోని కూడా డామినేట్ చేసేసింది అనే చెప్పాలి.
ఒక సన్నివేశంలో (Saranya Pradeep) శరణ్య బట్టలు లేకుండా చాలా బోల్డ్ గా నటించింది. ఆమె చేసింది కాబట్టి.. అలాంటి సీన్లో ఎక్కడా వల్గారిటీ ఫీలింగ్ అనిపించదు. చాలా ఎమోషనల్ గా అందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. అలాగే ‘విలన్ కి వార్ణింగ్ ఇచ్చే సన్నివేశాల్లో కానీ’ ‘పోలీస్ స్టేషన్’ లో విలన్ ని కాలితో తన్నే సన్నివేశంలో కానీ’ శరణ్య ఓ రేంజ్ లో పెర్ఫార్మ్ చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక నుండి డైరెక్టర్స్ ఈమెకు ఇలాంటి పవర్ఫుల్ రోల్స్ డిజైన్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!