Bigg Boss 5 Telugu: సరయు వరెస్ట్ పెర్ఫామర్స్ ఎవరో తెలుసా..?
- September 13, 2021 / 10:01 AM ISTByFilmy Focus
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 అసలు మజా స్టార్ట్ అయ్యింది. ఎలిమినేషన్ రోజు విశ్వరూపం చూపించింది సరయు. హౌస్ నుంచీ మొదటివారమే ఎలిమినేట్ అయిన సరయు ని 5మచ్ బెస్ట్ అలాగే 5మచ్ వరెస్ట్ పెర్ఫామర్స్ ఎవరో చెప్పమని హోస్ట్ నాగార్జున అడిగారు. దీనికి సరయు తనదైన స్టైల్లో రెచ్చిపోయింది. వెళ్తూ వెళ్తూ తనలోని ఆవేదని అక్కసుని వెళ్లగక్కింది సరయు. సరయు దృష్టిలో టాప్ లో శ్వేత, మానస్, ప్రియాంక, విశ్వ, హమీద లు బెస్ట్ పెర్ఫామర్స్ గా ఉన్నారు. అలాగే సిరి, సన్నీ , లహరి, షన్నూ, కాజల్ ఐదుగురిని వరెస్ట్ పెర్ఫామర్స్ గా డిక్లేర్ చేసింది సరయు. ఇక్కడే తను ఆర్గ్యూమెంట్స్ కి సైతం దిగింది.
ముఖ్యంగా సన్నీతో తనకి ఉన్న వర్క్ ఎక్స్ పీరియన్స్ ని సైతం షేర్ చేసింది. గతంలో ఇద్దరం కలిసి సినిమా చేసామని అక్కడ తను ఈగో ఫీలింగ్స్ ని మనసులో పెట్టుకుని హౌస్ లోకి రాంగానే నన్ను నామినేట్ చేశాడని, నేను ‘రా’ అని పిలిచినందుకు కాదు అని, ఒకవేళ అదే అయితే నేను సారీ కూడా అక్కడికక్కడే చెప్పాను అని చెప్పింది. దీనిని సన్నీ డిపెండ్ చేస్కునే ప్రయత్నం చేశాడు. ఇక ఇదే ఊపులో సిరికి షణ్ముక్ కి కూడా ఇచ్చిపారేసింది. మనసులో ఏది దాచుకోకుండా కడిగిపారేసింది.

బయటే వీళ్లు హౌస్ లో ఎలా ఉండాలి అని స్కెచ్ గీస్కుని వచ్చారని, పక్కా గేమ్ ప్లాన్ తో వచ్చి ఎక్స్ క్యూట్ చేస్తున్నారని చెప్పింది. ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తపడతారని, చాలా క్లవర్ అండ్ ఇంటిలిజెంట్ గేమ్ ఆడుతున్నారని చెప్పుకొచ్చింది. తర్వాత లహరి కూడా తనదైన స్టైల్లో క్లాస్ పీకింది. యాటిట్యూడ్ చూపిస్తూ మాట్లాడుతున్నావని, ఆ టోన్ తగ్గించుకోమని సలహా ఇచ్చింది సరయు. మొత్తానికి హౌస్ నుంచి వెళ్లిపోతూ అందరికీ ఒక రేంజ్ లో క్లాస్ పీకేసింది. ఇక సరయు ఎలిమినేట్ అవ్వడం పట్ల నెటిజన్స్ కూడా కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. మరికొన్ని రోజులు ఉంటే సరయు మంచి ఫైటర్ అయ్యేది అని అంటున్నారు. అదీ మేటర్.
నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!














