Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?
- September 9, 2026 / 06:38 PM ISTByPhani Kumar
కార్తీ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సర్దార్’. 2022 దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.100 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. దాదాపు 4 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘సర్దార్ 2’ రాబోతోంది. సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సర్దార్’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ‘సర్దార్ 2’ ని కూడా విడుదల చేస్తుంది.
Sardar 2

ఆల్రెడీ ‘సర్దార్ 2’ ని టాలీవుడ్..కి చెందిన కొంతమంది పెద్దలకి, సన్నిహితులకు చూపించారు అన్నపూర్ణ వారు. సినిమా చూసిన అనంతరం తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘సర్దార్ 2’ రన్ టైమ్ ఆల్మోస్ట్ 3 గంటలు ఉందట. సినిమా స్టార్టింగ్ పోర్షన్స్ లో సర్దార్ సినిమాలోని కొన్ని విజువల్స్..ని చూపించారట. మొదటి భాగం చూసిన వారికి తప్ప.. మిగిలిన వారికి అవి అర్దం కావని చెబుతున్నారు. అయితే తర్వాత కార్తీ ఇంట్రో కానీ, బ్యాక్ టు బ్యాక్ వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ టాప్ నాచ్..లో ఉంటాయట.
ఎస్ జె సూర్య క్యారెక్టరైజేషన్ ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని చెబుతున్నారు. అలాగే హీరోయిన్స్ తో చేయించే యాక్షన్ ఎపిసోడ్లు కూడా బాగుంటాయట. దర్శకుడు పీ ఎస్ మిత్రన్ ఈ సినిమాలో కూడా ఓ సోషల్ ఎలిమెంట్ టచ్ చేశాడని చెబుతున్నారు. క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుందట. కచ్చితంగా ‘సర్దార్ 2’ ఆడియన్స్ కి మంచి ఫీలింగ్ ఇస్తుందని అంటున్నారు. అయితే రిలీజ్ రోజున ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా












