Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే
- September 20, 2026 / 06:49 PM ISTByPhani Kumar
కార్తీ తమిళ హీరో అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు అతన్ని బాగా ఓన్ చేసుకున్నారు. తమిళంలో కార్తీ నటించే ప్రతి సినిమా.. సేమ్ డేట్ కి తెలుగులో కూడా డబ్ అవుతుంటుంది. ‘ఖైదీ’ ‘సర్దార్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. ‘సత్యం సుందరం’ కూడా పర్వాలేదు అనిపించుకుంది. ఇక ‘సర్దార్’ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని ముందుగానే ప్రకటించారు. వారు చెప్పినట్టు గానే సీక్వెల్ ని తీసి ఈ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
Sardar 2

‘సర్దార్ 2’ పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేస్తుంది. ‘సర్దార్’ చిత్రాన్ని రిలీజ్ చేసింది కూడా ఈ సంస్థే. దీంతో ‘సర్దార్ 2′(Sardar 2) పై మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి. అయితే మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా సొ సొగానే నమోదయ్యాయి. మొదటి రోజు సొ సొగా పర్వాలేదు అనిపించినప్పటికీ.. 2వ రోజు నుండీ బాగా డౌన్ అయ్యింది. వీక్ డేస్ లో కూడా అదే పరిస్థితి. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 1.03 cr |
| సీడెడ్ | 0.26 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.89 cr |
| ఏపి+ తెలంగాణ | 2.18 cr(షేర్) |
‘సర్దార్ 2’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల వరకు ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఆల్మోస్ట్ రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం ముగిసేసరికి కేవలం రూ.2.18 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.3.82 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది ఇక దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్
















