Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

కార్తీ తమిళ హీరో అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు అతన్ని బాగా ఓన్ చేసుకున్నారు. తమిళంలో కార్తీ నటించే ప్రతి సినిమా.. సేమ్ డేట్ కి తెలుగులో కూడా డబ్ అవుతుంటుంది. ‘ఖైదీ’ ‘సర్దార్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. ‘సత్యం సుందరం’ కూడా పర్వాలేదు అనిపించుకుంది. ఇక ‘సర్దార్’ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని ముందుగానే ప్రకటించారు. వారు చెప్పినట్టు గానే సీక్వెల్ ని తీసి ఈ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Sardar 2

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేస్తుంది. ‘సర్దార్’ చిత్రాన్ని రిలీజ్ చేసింది కూడా ఈ సంస్థే. దీంతో ‘సర్దార్ 2′(Sardar 2) పై మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ‘సర్దార్ 2’ తెలుగు వెర్షన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్ ను తెలుసుకుందాం రండి :

నైజాం  2 cr
సీడెడ్  0.50 cr
ఆంధ్ర(టోటల్)  2.5 cr
ఏపి+ తెలంగాణ  5 cr

‘సర్దార్ 2’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల వరకు ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఆల్మోస్ట్ రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ అయితే చిన్నదే. కానీ పోటీగా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ‘సర్దార్ 2’ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడం తప్పనిసరి అని చెప్పాలి. అప్పుడు లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ తో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉంటాయి.

ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus