సర్కారు వారి పాట : పోకిరి, దూకుడు లాంటి ఫీస్ట్ ఇచ్చేలా ఉన్నాడుగా..!

  • July 31, 2021 / 05:06 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న అప్ కమింగ్ మూవీ ‘సర్కారు వారి పాట’ .’మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మూవీలో మహేష్ బాబు సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు అని టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే స్పష్టం చేశారు దర్శకనిర్మాతలు.

ఇక ‘సూపర్ స్టార్ ఫస్ట్ నోటీస్’ అంటూ కొద్దిసేపటి క్రితం ‘సర్కారు వారి పాట’ నుండీ మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ పోస్టర్ లో మహేష్ బాబు… మునుపెన్నడూ లేని విధంగా అల్ట్రా స్టయిలిష్ లుక్ లో కనిపిస్తుండడం విశేషం.కార్ నుండీ మహేష్ దిగుతున్నట్టు ఫోజ్ ఇచ్చాడు. ఆగష్ట్ 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆరోజున ‘సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్’ పేరుతో ఓ టీజర్ ను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఈ పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు. అంతేకాకుండా విడుదల తేదీని కూడా ప్రకటించారు.

2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.ఏమైనా ఈ పోస్టర్ సినిమా పై మరిన్ని అంచనాలను పెంచేలా అనిపిస్తుంది. మరి ఆగష్ట్ 9న రిలీజ్ అయ్యే ఆ ‘బ్లాస్టర్’ ఎలా ఉండబోతుందో చూడాలి..!

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus