RC17: దేశమంతా తిరిగి.. ఫైనల్గా తెలుగమ్మాయిని హీరోయిన్గా ఓకే చేసిన సుకుమార్
- October 31, 2026 / 03:30 PM ISTByFilmy Focus Desk
సినిమాకు కొబ్బరికాయ ఎప్పుడు కొడతార తెలియదు కానీ. రోజుకో హీరోయిన్ పేరును అయితే బయటకు తీసుకొస్తున్నారు లెక్కల మాస్టారూ అండ్ టీమ్. అవును మళ్లీ రామ్చరణ్ సినిమా గురించే చర్చ. దసరాకు లాంఛనంగా సినిమాను ప్రారంభిస్తారు అనే వార్త వచ్చినా.. ఎందుకో ఈ సినిమా అప్పుడు స్టార్ట్ కాలేదు. త్వరలో సినిమాకు కొబ్బరికాయ అని చెబుతున్నారు. ఈ క్రమంలో మూడో హీరోయిన్ పేరు బయటకు వచ్చింది. ఈసారి తెలుగమ్మాయి.
Satvika Veeravalli
అవును, మీరు చదివింది నిజమే. రామ్ చరణ్ 17వ సినిమా గురించి, అందులో హీరోయిన్ గురించి గత కొన్ని నెలలుగా రకరాల వార్తలు వస్తున్నాయి. సినిమా ఆఫీస్ ప్రారంభించి.. ప్రాజెక్ట్ మీద ఆ మధ్య మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో సినిమాలో హీరోయిన్ ఎవరు అనే చర్చ బయటకు వచ్చింది. దీనికి ఇప్పటికి ఒక పాన్ ఇండియా హిట్, ఒక బాలీవుడ్ యూత్ హిట్ సినిమాల నాయికల పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఓ సౌత్ పాన్ ఇండియా సినిమా హీరోయిన్ పేరు ఓకే చేశారట.

ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది కదూ. అవును మీరు అనుకున్నది నిజమే. ఆమె ఎవరో కాదు ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్న సాత్విక వీరవల్లి. త్వరలోనే రామ్చరణ్, సాత్వికకు ఫొటో షూట్ చేస్తారని సమాచారం. అయితే ఇప్పటివరకు ఓకే అనుకున్న సారా అర్జున్, అనీత్ పడ్డా కంటే రూరల్ గాళ్ పాత్రకు సాత్విక అయితే బెటర్ అని అనుకుంటున్నారట.
ఇక ‘ఆకాశంలో ఒక తార’ సినిమా సంగతి చూస్తే.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా తెరకెక్కింంది. పవన్ సాధినేని ఈ సినిమా దర్శకుడు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమైంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే నవంబరు 20న సినిమాను రిలీజ్ చేస్తారట. ఇఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. అవి చూసే సుకుమార్ ఆమెను సంప్రదించారని టాక్.















