Satya Dev, Chiranjeevi: చిరు సినిమాలో విలన్ గా కుర్ర హీరో!

  • August 7, 2021 / 07:29 PM IST

టాలీవుడ్ లో ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్నాడు నటుడు సత్యదేవ్. ఆ తరువాత ‘బ్లఫ్ మాస్టర్’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ లాంటి సినిమాలు అతడికి మంచి పేరు తీసుకొచ్చాయి. రీసెంట్ గా ఈ హీరో నటించిన ‘తిమ్మరుసు’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లు తెరుచుకున్న తరువాత విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ హీరోకి డిమాండ్ బాగా పెరిగింది.

హీరోగా పలు సినిమాలు చేస్తూనే ఇతర సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నాడు. మొన్నామధ్య మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సత్యదేవ్ ను ఇంటికి పిలిచి అభినందించారు. అయితే ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ ను దక్కించుకున్నాడు ఈ యంగ్ హీరో. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకై సంబంధించిన ఇప్పుడు క్యాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే నయనతారను ఓ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పుడు సత్యదేవ్ కి కూడా మంచి రోల్ ఆఫర్ చేశారట. ఒరిజినల్ వెర్షన్ లో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నాడని సమాచారం. సినిమాలో ఇదొక నెగెటివ్ రోల్. కథకు చాలా కీలకం కూడా. అలాంటి పాత్రను సత్యదేవ్ కి ఆఫర్ చేశారంటే విశేషమే చెప్పాలి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus