Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

ఇమిటేషన్‌ – ట్రోలింగ్‌.. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఇప్పుడెందుకు ఈ చర్చ అంటే.. ఆ మధ్య ‘కొరియన్ కనకరాజు’ సినిమా వచ్చిన సమయంలో ఈ విషయం గురించి తెగ మాట్లాడుకున్నారు. దివంగత ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావును ట్రోల్‌ చేశారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే అది ఇమిటేషన్‌ అని చెప్పినా ఆ ఆందోళనకారులు వినలేదు. అయితే ఇప్పుడు ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’ సినిమాలో అలాంటి ఇమిటేషన్లు చాలానే ఉన్నాయి.

Comrade Kalyan

నిజానికి, శ్రీవిష్ణు సినిమాలో ఇమిటేషన్‌లు, వెటకారాలు తక్కువేం కాదు. గతంలో చాలానే చూశాం. అయితే ‘కొరియన్‌ కనకరాజు’ తర్వాత టాలీవుడ్‌ ఇమిటేషన్లను తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. ‘కామ్రేడ్ కల్యాణ్‌’ సినిమా లోని ఒక సన్నివేశంలో ‘ఆచార్య’ సినిమాను అనుకరిస్తూ శ్రీవిష్ణు ఓ డైలాగు ఉంది. పాదఘట్టం, ధర్మస్థలి అని మాట్లాడతాడు. ఓ కమెడియన్‌కు సంజయ్ సాహూ అని పేరు కూడా పెట్టారు. ఇది ‘జల్సా’ సినిమాలో పవన్ కల్యాణ్ పేరు.

ఈ సినిమాలో ఆర్.నారాయణమూర్తిని శ్రీవిష్ణు, సత్య ఇమిటేట్ చేశారు. ఇంకో సీన్‌లో ‘అరవింద సమేత’ సినిమాలో ఎన్టీఆర్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ సీన్‌ని శ్రీవిష్ణు ఇమిటేట్‌ చేశాడు. ఇంకో దగ్గర అటీవీ శాఖ మంత్రి పేరు ముల్లేటి పుష్పరాజ్‌ అని కూడా అంటారు. ఇవి కొన్ని మాత్రమే సినిమాలో ఇలాంటివి చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా కొంతమంది ఆ క్లిప్స్‌ వేసి మా హీరోకు అవమానం అయిపోయింది అంటున్నారు. కామెడీ సినిమాల్లో స్పూఫ్‌లు, పేర‌డీలు కామ‌న్. ఈ విషయంలో స్పోర్టివ్‌గా ఉండాలి. ఎలా అంటే ‘ఆచార్య’ దళం అనే సీన్‌ని చిరంజీవి ఎంజాయ్‌ చేసినట్లు.

ఇక్కడ పాయింట్‌ ఏంటంటే.. తమ హీరో సీన్‌నో, ఎక్స్‌ప్రెషన్‌లో మరో హీరో ఇమిటేట్‌ చేస్తే హర్ట్‌ అవ్వకూడదు. ఎంజాయ్‌ చేయాలి. అయితే వ్యక్తిగతంగా విమర్శిస్తే తట్టకోవాల్సిన అవసరం లేదు. అంతేకానీ ఇమిటేషన్‌ని చూసి ఇరిటేషన్‌ అయితే ఫ్రస్టేషనే మిగులుతుంది.

రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus