హిట్ మూడు, బ్లాక్‌బస్టర్ మోడ్‌లో ఉన్నప్పుడు ఓ దర్శకుడు ఇతర హీరోలకు కథ చెప్పేటప్పుడు వచ్చే రెస్పాన్స్ వేరు.. ఆ సినిమాను పట్టాలెక్కించడానికి ఉండే స్పీడ్ వేరు. అయితే ఆ దర్శకుడు ఫ్లాప్ జోన్‌లోకి వెళ్లిపోతే, మాట వినడు అనే మూడ్‌లోకి వెళ్లిపోతే ఆ ప్రాజెక్ట్ అంత ఈజీగా పట్టాలెక్కదు. ఏమైంది అనే విషయం బయటకు రాకుండానే కొత్త హీరోను వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి చెప్పిన కథ కూడా ఓ కారణం అవ్వొచ్చు అనుకోండి.
ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో యువ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఉన్నారా? అవుననే అంటున్నాయి కోడంబాక్కం వర్గాలు. రీసెంట్ భారీ హంగామాతో అనౌన్స్ అయిన అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా విషయంలో కొత్త రాగాలు వినిపిస్తున్నాయి. అదే ఈ సినిమా విషయంలో మరో ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నాడని.. అంతే కాదు ఈ ప్రాజెక్ట్ పనులను లోకేశ్ హోల్డ్ చేసి.. ఓ బాలీవుడ్ హీరోకు కొత్త కథ చెప్పారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
అలాగే, అల్లు అర్జున్‌కి (Allu Arjun) చెప్పిన కథను మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ మరో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోల దగ్గరకు తీసుకెళ్లింది అని కూడా చెబుతున్నారు. ఈ మేరకు ఆ ఇద్దరికీ లోకేశ్ ఈ లైన్ చెప్పారు అని కూడా అంటున్నారు. త్వరలో ఈ మేరకు అనౌన్స్‌మెంట్స్ రావొచ్చు అని కూడా అంటున్నారు. ఆ అనౌన్స్‌మెంట్ వస్తే.. ఇక అల్లు అర్జున్ సినిమా ఆగిపోయినట్లే అని చెప్పేయొచ్చు. ఈ నెల 23న ఈ విషయంలో కాస్త క్లారిటీ వస్తుంది అని అంటున్నారు.
ఈనేపథ్యంలో ఓ చర్చ జరుగుతోంది. ‘కూలీ’ సినిమా సమయంలో లోకేశ్ కనగరాజ్ తర్వాతి సినిమా కూడా ఫిక్స్ అయిపోయింది. అదే కమల్ హాసన్ – రజనీకాంత్ సినిమా. ఆ సినిమా పట్టాలెక్కలేదు. అదే సమయంలో ఆమిర్ ఖాన్‌తో ఓ సినిమా అన్నారు. అది కూడా అవ్వలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా గురించి ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి. అన్నట్లు లోకేశ్ చేస్తా అని చెప్పిన ‘ఖైదీ 2’, ‘రోలెక్స్’ సినిమాలు కూడా అక్కడే ఉండిపోయాయి.