చిత్ర పరిశ్రమలో అనేక సెంటిమెంట్లు ఉంటాయి. కొందరు కాంబినేషన్లను నమ్మితే, మరికొంతమంది ఫలానా నెలలో, తేదీలో సినిమా రిలీజ్ చేస్తే హిట్ అవుతుందని విశ్వసిస్తారు. ఇలాంటి సెంటిమెంట్లు చిన్న హీరోల దగ్గర నుంచి, పెద్ద హీరోల వరకు ఉంటాయి. అయితే మెగాస్టార్ చిరంజీవికి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సక్సస్ సెంటిమెంట్ ఒకటే కావడం ఇక్కడ విశేషం. ఆ కామన్ సెంటిమెంట్ ఏంటంటే.. ‘రామానాయుడు స్టూడియోస్’. ఇక్కడ సినిమా తీస్తే హిట్ గ్యారంటీ అని ఈ స్టార్ హీరోలు నమ్ముతారు.
చిరు ఠాగూర్, తారక్ సింహాద్రి చిత్రాలను ఎక్కువ శాతం ఈ స్టూడియోలోనే చిత్రీకరించారు. అవి ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో వారి నమ్మకం మరింత బలపడింది. అందుకే అక్కడ ఒక సీన్ అయినా తీయాలని ఆరాటపడుతుంటారు. సెప్టెంబర్ 2 న విడుదల కానున్న “జనతా గ్యారేజ్ ” సినిమాలోని కొన్ని కీలకమైన సీన్లను రామానాయుడు స్టూడియోస్ లో ఎన్టీఆర్ పట్టుబట్టి తీయించుకున్నారంట. చిరు తన రీ ఎంట్రీ చిత్రం భారీ హిట్ అందుకోవాలని కొన్ని సెక్వెన్స్ లను ఇక్కడే షూట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. చాలా కాలం తర్వాత వీరిద్దరి సెంటిమెంట్లు ఎంతవరకు విజయానికి హెల్ప్ అవుతుందో కొన్ని రోజుల్లో తెలియనుంది.