ఈ మధ్య కాలంలో తల్లి పాత్రలలో నటిస్తూ సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటున్న సీనియర్ నటీమణులలో తులసి ఒకరు. బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన తులసి కొన్ని సినిమాలలో హీరోయిన్ రోల్స్ లో కూడా నటించారు. కొన్ని సినిమాలలో తులసి సెకండ్ హీరోయిన్ గా చేశారు. కన్నయ్య కిట్టయ్య మూవీ హీరోయిన్ గా తులసికి చివరి మూవీ కావడం గమనార్హం. తులసి తన సినీ కెరీర్ లో 300కు పైగా సినిమాలలో నటించారు.
తాజాగా తులసి ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు గెస్ట్ గా హాజరై సందడి చేశారు. ఈ షో ప్రోమోలో తులసి మాట్లాడుతూ మా నాన్న చిన్నప్పుడే మోసం చేసి వెళ్లిపోయారని చెప్పారు. మా అన్నయ్య నాన్నలా ఉండి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారని ఆమె చెప్పారు. భాస్కర్ అన్నయ్యా ఐ లవ్ యూ యు ఆర్ ది బెస్ట్ అంటూ తులసి శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఎమోషనల్ అయ్యారు. ఈ నెల 5వ తేదీన ఈ ఎపిసోడ్ ఈటీవీ ఛానల్ లో ప్రసారం కానుంది.
ఈ ఎపిసోడ్ లో ప్రధానంగా కొందరు కంటెస్టెంట్లు అక్కా తమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చూపించారు. బుల్లెట్ భాస్కర్, వర్ష, మహేష్ విట్టా, మరి కొందరు కంటెస్టెంట్లు తమ సోదరులు, సోదరీమణులతో హాజరై సందడి చేశారు. బుల్లెట్ భాస్కర్ 11 సంవత్సరాల నుంచి తనకు, తన చెల్లికి మాటల్లేవని ఈ షో వల్ల మళ్లీ కలిసి మాట్లాడుకుంటున్నామని చెప్పుకొచ్చారు. మహేష్ విట్టా తాను దొంగతనం చేసిన ప్రతిసారి తన సిస్టర్ కే దొరికేవాడినని తెలిపారు.