మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటి హేమ తాజాగా సీనియర్ నరేష్ ‘మా’ నిధులలో మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ‘మా’ అసోసియేషన్ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై స్పందించిన సీనియర్ నరేష్ హేమ వ్యాఖ్యలను తప్పబట్టడంతో పాటు హేమపై చర్యలు తీసుకుంటామని కామెంట్లు చేశారు. ‘మా’ అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా హేమ కామెంట్లు చేశారని సీనియర్ నరేష్ చెప్పుకొచ్చారు.
హేమ గురించి క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేస్తామని సీనియర్ నరేష్ అన్నారు. క్రమశిక్షణా సంఘం నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటమని సీనియర్ నరేష్ చెప్పుకొచ్చారు. ఎన్నికలు ఆలస్యంగా జరగడానికి కరోనానే కారణమని నరేష్ అన్నారు. సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకుంటామని నరేష్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో ‘మా’ ఎన్నికల గురించి ఉత్కంఠ నెలకొంది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ తో పాటు హేమ, జీవిత, సీవీఎల్ నరసింహారావు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో అధ్యక్ష పదవికి ఎవరు ఎంపికవుతారో చూడాల్సి ఉంది.
వచ్చే నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తుండటం గమనార్హం. నాగబాబు ప్రకాష్ రాజ్ కు మద్దతు ప్రకటించగా బాలయ్య మంచు విష్ణుకు మద్దతు ఇచ్చారు. ‘మా’ ఎన్నికలకు పోటీ చేస్తున్న జీవితా రాజశేఖర్ సైతం హేమ చేసిన వ్యాఖలు సరికాదని అన్నారు.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!