Sukanya: ఆమె నా కూతురు కాదంటూ సుకన్య షాకింగ్ కామెంట్స్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ సీనియర్ నటిమణులలో సుకన్య (Sukanya) ఒకరు. ఒకప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సుకన్య ఒక వెలుగు వెలిగారు. ఇతర భాషల్లో సైతం స్టార్ హీరోలకు జోడీగా నటించి సుకన్య పాపులర్ అయ్యారు. ఈ మధ్య కాలంలో సుకన్య ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదనే సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం సుకన్య కూతురు అంటూ ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది.

ఆమె అభిమానులు సైతం వైరల్ అవుతున్న ఫోటో రియల్ ఫోటోనే అని ఆ అమ్మాయి సుకన్య కూతురు అని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలు మరీ ఎక్కువ కావడం ఫోటోలోని యువతి తన కూతురు కాకపోవడంతో సుకన్య ఈ వార్తల గురించి స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. వైరల్ అవుతున్న యువతి ఫోటోను నేను కూడా చూశానని ఆమె నా కూతురు కాదని నా చెల్లెలి కూతురని సుకన్య వెల్లడించడం గమనార్హం.

ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఆ ఫోటోకు సంబంధించి క్లారిటీ ఇచ్చానని సుకన్య పేర్కొన్నారు. నా పెళ్లి జరిగిన కొన్ని నెలల్లోనే విడాకులు తీసుకున్నానని మేము కొన్ని నెలలు మాత్రమే కలిసి ఉన్నామని సుకన్య చెప్పుకొచ్చారు. అయితే సరదాగా నా చెల్లెలి కూతురు ఫోటోను షేర్ చేస్తూ నా కూతురు అంటూ ప్రచారం చేస్తున్నారని ఆమె తెలిపారు. వైరల్ అయిన వార్త వల్ల తనకు గుర్తింపు వచ్చిందని నా చెల్లెలి కూతురు సంతోషించిందని సుకన్య పేర్కొన్నారు.

పుదు నెల్లు పుదు నాత్తు అనే తమిళ్ మూవీతో సుకన్య సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. భారతీయుడు సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ లో సాంబ(Samba) , మున్నా (Munna) , శ్రీమంతుడు (Srimanthudu) సినిమాలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఎవరైనా మంచి అవకాశాలు ఇస్తే నటించడానికి సిద్ధమేనని సుకన్య పేర్కొన్నారు. సుకన్య చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus