ముదురుతున్న సీరియల్ జంట వివాదం… ఆడియో క్లిప్ వైరల్..!

కోలీవుడ్ సీరియల్ జంట వివాదం రోజు రోజుకు ముదురుతున్నట్టు కనిపిస్తుంది.అర్నవ్‌-దివ్యల వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. తన భర్తను వలలో వేసుకుని తన కాపురంలో నిప్పులు పోసింది అంటూ దివ్య చేసిన ఆరోపణలే నిజమని ఓ ఆడియో క్లిప్ లీక్ అయ్యింది. ‘చెల్లమ్మ’ సీరియల్‌ ఫేమ్‌.. నటి అన్షిత ఫోన్‌ కాల్‌ ఆడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇందులో అన్షిత..దివ్యని బెదిరిస్తోంది. అలాగే అర్నవ్‌కు ఐ లవ్‌ యూ కూడా చెప్పింది.

“నువ్వు ఓ ఆడిపిల్లవయ్యి ఉండి మరో ఆడిపిల్ల జీవితాన్ని నాశనం చేయకూడదు’ అంటూ దివ్య ఎమోషనల్ గా మాట్లాడుతుంటే…., అందుకు స్పందించిన అన్షిత ‘‘ నువ్వు ఇప్పుడు నా చేతికి చిక్కితే ఏం చేస్తానో తెలుసా?.. నిన్ను కొట్టి కొట్టి చంపి కుక్కలకు వేస్తాను.నీ పై అంత కోపం ఉంది. ఎందుకే నువ్వు ఇంకా ఈ భూమిపై బ్రతికున్నావు.భూమికి బరువు తప్ప. కొంచెం కూడా తెలివి లేదా?నేను అర్నవ్‌తో ఏం చేస్తానో చూస్తూ ఉండు’’ అంటూ కాన్ఫరెన్స్‌ కాల్‌లో ఉన్న అర్నవ్‌కు ఐ లవ్‌ యూ చెప్పి….ముద్దులు కూడా ఇస్తున్నట్టు రెచ్చగొట్టింది.

దీంతో సోషల్ మీడియాలో దివ్యకి మద్దతు పెరుగుతుంది.ఆమె ఆరోపణలే నిజమని తమిళ జనాలు నమ్ముతున్నారు.దివ్యకు అర్నవ్‌తో 2017లో పరిచయం ఏర్పడింది. ‘కేలాడి కన్‌మణి’ సీరియల్‌ షూటింగ్‌ టైంలో వీరు మొదటి సారి కలిశారు.దివ్యకి సరిగ్గా అప్పుడే విడాకులు అయ్యాయి. ఓ సంవత్సరం పాప కూడా ఉంది. ఈ విషయం తెలిసి కూడా అర్నవ్ ఇష్టపడుతున్నట్లు చెప్పడంతో వీరు పెళ్లి చేసుకున్నారు.

కొన్నాళ్ళకు దివ్య ప్రెగ్నెంట్ అయ్యింది. అప్పటి నుండి దివ్యని దూరం పెట్టడం మొదలుపెట్టాడు అర్నవ్. ఓ రోజు షూటింగ్ స్పాట్ కు వెళ్లిన దివ్యకు అక్కడ రూమ్లో అర్నవ్ – అన్షిత లు ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అప్పుడు దివ్య నిలదీయగా అన్షు రెచ్చిపోయి అర్నవ్ కు ముద్దులు ఇవ్వడం మొదలుపెట్టింది. దీంతో వివాదానికి బీజం పడింది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus