సినీ పరిశ్రమ అనేది బయట చూసేవారికి రంగుల ప్రపంచమే… కానీ ఇక్కడ కూడా ఎవరి కష్టాలు వారికి ఉంటాయి. సక్సెస్ లు ఉంటేనే అవకాశాలు వస్తాయి.. అవకాశాలు వస్తేనే నాలుగు డబ్బులు ఉంటాయి, గుర్తింపు ఉంటుంది. లేదు అంటే సడన్ గా మొత్తం మైనస్ అయిపోతుంది. జీరో నుండి వచ్చిన వాళ్ళు తిరిగి జీరోకి వెళ్లినా ఏదో ఒక రోజు మళ్ళీ ఎదుగుతారు. కానీ మొదటి నుండి టాప్ లో ఉండి పడ్డ వాళ్ళు మాత్రం కోలుకున్న వాళ్ళు తక్కువ.
సరే ఇక అసలు విషయానికి వస్తే.. ఓ నటి అవకాశాలు లేక కాల్ సెంటర్ లో పనిచేస్తుందట. అయితే ఈమె తన తప్పిదాల వల్ల కింద పడిన వ్యక్తి కాదు. కరోనా కారణంగానే అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఆమె మరెవరో కాదు సీరియల్ నటి ఏక్తా శర్మ. ఆమె మాట్లాడుతూ.. “2 ఏళ్లుగా నాకు అవకాశాలు లేవు.దీంతో ఇల్లు గడవడం కష్టమైంది. అందుకోసం నగలు కూడా అమ్మేశాను. ప్రస్తుతం నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను.
అవకాశాలు రావడం లేదని ఏడుస్తూ కూర్చుంటే బతుకు నడవదు కదా.. అందుకే చదువుకి తగ్గ జాబ్ వెతుక్కున్నాను, ఇప్పుడు కాల్ సెంటర్ లో పని చేస్తున్నాను. కాల్ సెంటర్ లో పని చేయడం తప్పనిపించడం లేదు.ఎవరో వస్తారు, మనకేదో చేస్తారు, ఏదో అద్భుతం జరుగుతుంది అంటూ ఎదురుచూడడం టైం వేస్ట్..! ఇప్పటికైతే కాల్ సెంటర్ లో పనిచేస్తూ ఆడిషన్స్ ఇస్తున్నాను.ఎప్పటికైనా మళ్ళీ అవకాశాలు వస్తాయన్న నమ్మకం నాకు ఉంది” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.’డాడీ సంఝా కరో’, ‘కుసుమ్’, ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’, ‘కామినీ-దామిని’ ‘బెప్నా ప్యార్’ వంటి టీవీ షోలలో కనిపించింది.
Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!