Shaakuntalam: ఆకట్టుకుంటున్న సమంత ‘శాకుంతలం’ ఫస్ట్ లుక్..!

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా ఈ మూవీలో అతిథి పాత్ర పోషించింది. ప్రపంచం నలుమూలలున్న పండితుల ప్రశంసలు పొందిన సంస్కృత‌ నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల‌ చేయబోతున్నారు.

శాకుంత‌లం కోట్లాదిమంది హృద‌యాల‌ను గెలుచుకున్న శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు మ‌ధ్య ఉన్న అజ‌రామ‌ర‌మైన ప్ర‌ణ‌య‌గాథ ఇది అని తెలుపుతూ తాజాగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇందులో శకుంత‌ల‌గా స‌మంత‌.. దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ కనిపిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ కు ప్రేక్ష‌కుల నుండి మంచి స్పందన లభిస్తుంది. ఈ ఫస్ట్ లుక్ లో సమంత చాలా అందంగా కనిపిస్తుంది. డైరెక్ట‌ర్‌ గుణ శేఖర్ కశ్య‌ప క‌నుమ‌లు (కాశ్మీర్‌)లో సాగే ఈ ప్రేమ క‌థ‌ను చాలా గ్రాండియర్ గా,

తన మార్క్ మిస్ అవ్వకుండా తెరకెక్కిచినట్టు స్పష్టమవుతుంది. స‌చిన్ ఖేడేక‌ర్‌, క‌బీర్ బేడీ, డా.ఎం.మోహ‌న్ బాబు, ప్రకాష్ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా వంటి స్టార్ క్యాస్టింగ్ ఈ చిత్రంలో ఉంది. దిల్ రాజు స‌మర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమ గుణ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. ఇక ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 4న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు కొద్దిసేపటి క్రితం మేకర్స్ ప్రకటించారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus