‘పఠాన్’, ‘జవాన్’ అంటూ ఈ ఏడాది రెండు భారీ బ్లాక్‌బస్టర్‌లు అందుకున్న బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మూడో సినిమాతో రెడీ అయిపోయాడు. ఆ రెండు సినిమాలు మాస్ యాక్షన్ జోనర్‌లో అయితే, మూడో సినిమా ‘డంకీ’ క్లాస్ డిఫరెంట్ లుక్ మూవీ. ఈ సినిమాను ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో కొన్ని మీ కోసం.
షారుఖ్ ఖాన్ – రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ ఈ సినిమా ఫస్ట్ స్పెషాలిటీ అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ కాంబినేషన్ కాబట్టి. అంతేకాదు ఈ సినిమాను షారుఖ్ అభిమానుల కోసమో, మరొకరి కోసమో కాదు… తన కోసం తాను నటించాడు. ఇక ఆఖరిగా ఈ సినిమా బడ్జెట్ రూ. 85 కోట్లు. గత ఆరేళ్లలో వచ్చిన షారుఖ్ సినిమాల్లో ఇదే లోయెస్ట్ బడ్జెట్. సినిమా ప్రీ ప్రొడక్షన్‌కు చాలా రోజులే తీసుకున్నారు హిరానీ.
షూటింగ్‌తో కలిపితే ఈ సినిమాకు 30 నెలలకుపైగా సమయం పట్టింది. ఈ సినిమాకు తొలుత ‘రిటర్న్ టికెట్’, ‘టాస్’ లాంటి పేర్లు అనుకున్నారట. అయితే చివరకు ‘డంకీ’ని అని ఫిక్స్ చేశారు. ఈ సినిమా పేరు చూసి తొలుత చాలామంది ‘డాంకీ’ అని పలికేవారని షారుఖ్ ఆ మద్య చెప్పాడు. 9 ఏళ్ల విరామం తర్వాత సీనియర్ నటుడు సతీశ్ షా మళ్లీ ఈ సినిమాతో ముఖానికి రంగేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ 75 రోజుల్లో పూర్తవ్వగా… షారుఖ్ సుమారు 60 రోజులు నటించాడట.
ఇక ఈ సినిమా కథ సంగతి చూస్తే… భారత్ నుండి ఎన్నో దేశాలు దాటి యూకేలోకి అక్రమంగా ప్రవేశించే స్నేహితుల కథ ఇది. ఈ క్రమంలో వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లేంటి? అసలు వాళ్లు ఎందుకు అక్రమంగా వెళ్లాలనుకున్నారు? అనేదే సినిమా కథ. అన్నట్లు దేశ సరిహద్దుల గుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్ అంటారు. పంజాబీలు దీనిని (Dunki) ‘డంకీ’ అంటారు. అలా ఈ సినిమాకు ఆ పేరు పెట్టారు.
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!