Shahrukh Khan: ‘పఠాన్’ సినిమా ప్రమోషన్స్ పై షారుఖ్ కామెంట్స్!

  • January 30, 2023 / 05:16 PM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ దాదాపు నాలుగేళ్ల తరువాత ‘పఠాన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఏవరేజ్ టాక్ తోనే ఈ సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. వీకెండ్ లో కూడా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. వీకెండ్ తో కలుపుకొని రూ.500 కోట్లు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇంతగా సంచలనం సృష్టిస్తోన్న ఈ సినిమాను షారుఖ్ సరిగ్గా ప్రమోట్ చేయలేదు.

బయట ఎక్కడా పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఆన్ లైన్ లో కూడా ఒకసారి అభిమానులతో చాట్ చేశాడే తప్ప.. ఇంకేమీ చేయలేదు. సాధారణంగా అయితే షారుఖ్ తన సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ లో పాల్గొనడం, మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేసేవారు. కానీ ‘పఠాన్’ విషయంలో అలా జరగలేదు. కనీసం సినిమాకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్న సమయంలో కూడా షారుఖ్ సినిమాని ప్రమోట్ చేయలేదు.

మరోసారి ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో మాట్లాడి ఊరుకున్నాడంతే. ఇదే విషయంపై ఓ నెటిజన్ ఆయన్ను ప్రశ్నించారు. షారుఖ్ ని ఉద్దేశిస్తూ.. ‘మీరెందుకు సినిమాను ప్రమోట్ చేయలేదు. బయటకి ఎందుకు రాలేదు’ అని ప్రశ్నించారు. దీనికి షారుఖ్ తనదైన శైలిలో బదులిచ్చారు. ‘సింహాలు ఇంటర్వ్యూల్లో పాల్గొనవు. కాబట్టి నేను కూడా ఈసారి ఇంటర్వ్యూలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా’ అంటూ చమత్కరించారు.

నిజానికి ఈసారి షారుఖ్ ఖాన్ తన సినిమాను ప్రమోట్ చేయకపోవడానికి ఒక కారణం ఉంది. ‘పఠాన్’ చుట్టూ వివాదాలు ముసురుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రెండ్ సృష్టించారు. ఇలాంటి సమయంలో ఇంటర్వ్యూలు ఇచ్చి అందులో ఏదైనా తప్పుగా మాట్లాడితే ఇంకా గొడవ చేసి సినిమాను దెబ్బ తీస్తారని షారుఖ్ సైలెంట్ గా ఉన్నట్లున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus