బాహుబలి కంక్లూజన్ లో బాలీవుడ్ బాద్ షా
- February 13, 2017 / 02:02 PM ISTByFilmy Focus
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న బాహుబలి కంక్లూజన్ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడేకొద్దీ ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి బిగినింగ్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఘనవిజయం సాధించింది. దీనికి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి 2 కి క్రేజ్ పెంచడానికి జక్కన్న కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. హిందీలో కలక్షన్ల వర్షం కురియడానికి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ని నటింపచేసినట్లు తెలిసింది. షారుక్ పోషించిన పాత్ర సినిమాలో కీలక సమయంలో వచ్చి అలరిస్తుందని సమాచారం.
పాత్ర నిడివి తక్కువ ఉన్నప్పటికీ పవర్ ఫుల్ గా ఉండడంతో షారుక్ అంగీకరించారని టాక్. అయితే షారుక్ అభిమానులను ఆశ్చర్యపరచడానికి ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. వీఎఫ్ఎక్స్ టీమ్ సభ్యులు షారుక్ నటన చూసి ఆనందంతో ఈ విషయాన్ని లీక్ చేసినట్లు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం షారుక్ ఖాన్ కూడా బాహుబలి 2 కోసం వైటింగ్ చేస్తున్నానని మీడియాకి చెప్పారు. ఆ మాటల వెనుక అర్థం ఇదని ఇప్పుడు తెలుస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















