ఆర్జీవి వరకూ ఒకే కానీ.. ఎన్టీయార్ అంటే కష్టమేమో!

కమెడియన్ గా తెలుగు ప్రజలందరికీ సుపరిచితుడైన షకలక శంకర్ కి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగా, “జబర్డస్త్” షోలో ఒన్ ఆఫ్ ది పార్టీసిపెంట్ గా కామెడీ పండించిన షకలక శంకర్ తర్వాతికాలంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొన్నామద్య సూపర్ హిట్ అయిన “ఆనందోబ్రహ్మ” సినిమాలో షకలక శంకర్ క్యారెక్టరే హైలైట్. రాంగోపాల్ వర్మను ఇమిటేట్ చేయడంలో శంకర్ సిద్ధహస్తుడు. అందుకే మనోడి చేత వర్మని ఇమిటేట్ చేసే షోలు స్పెషల్ గా చేయించుకొనేవారు చానల్స్ వారు.

ఇప్పుడు ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకొంటూ కథానాయకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నాడు షకలక శంకర్. “డ్రైవర్ రాముడు” అనే సినిమాతో హీరోగా పరిచయమవ్వనున్నాడు. సీనియర్ ఎన్టీయార్ కెరీర్ లో ఒన్నాఫ్ ది బిగ్గెస్ట్ ఫిలిమ్ గా పేర్కొనదగ్గ “డ్రైవర్ రాముడు” చిత్రంలో షకలక శంకర్ ఎన్టీయార్ ను ఇమిటేట్ చేయనున్నాడని ఫస్ట్ లుక్ లోనే తెలిసిపోతుంది. అర్జీవిని శంకర్ అద్భుతంగా ఇమిటేట్ చేస్తాడని తెలుసు కానీ అన్నగారిని ఎంతవరకూ ఎలాంటి అతి చేయకుండా కామెడీ పండిస్తాడు అనేది సినిమా రిలీజయ్యాక చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus