Shakeela: డబ్బు కోసమే మా అమ్మ అలా చేసింది.. షకీలా కామెంట్స్ వైరల్!

  • November 2, 2023 / 06:20 PM IST

సినీనటి షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో వ్యాంపు పాత్రలలో నటించి నటువంటి ఈమె ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో షకీలా లేనిదే సినిమాలు కూడా వచ్చేవి కాదు. ఇలా ప్రతి ఒక్క సినిమాలో కూడా ఈమెకు అవకాశం కల్పించేవారు ఇక ఈమె నటిస్తున్నటువంటి సినిమా విడుదల అవుతుంది అంటే కొంతమంది స్టార్ హీరోలు తమ సినిమా విడుదలను కూడా వాయిదా వేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అప్పట్లో అంతలా క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి షకీలా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అయితే గతంలో ఈమె ఎన్నో సందర్భాలలో మాట్లాడుతూ తన కుటుంబమే తనని దారుణంగా మోసం చేసింది అంటూ తెలియజేశారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి తన కెరీర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తన కెరియర్ ఇలా నాశనం అవ్వడానికి తన సొంత వాళ్లే కారణమని ఈమె తెలియజేశారు.

చిన్నప్పటినుంచి మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి అయితే డబ్బు కోసం చిన్నప్పుడే కుటుంబ పోషణ తన చేతులలోకి తీసుకోవాల్సి వచ్చిందని షకీలా తెలిపారు. ఇక చిన్నప్పటినుంచి నేను వయసుకు మించి కాస్త హైట్ బలంగా ఉండడంతో దారి వెంట వెళ్తున్నా నన్ను మగవారు తదేకంగా చూసేవారు ఎందుకలా చూస్తున్నారో నాకు అర్థం అయ్యేది కాదని ఈమె తెలిపారు. ఇక డబ్బు కోసం మా అమ్మ కొంతమంది మగవారిని నాకు పరిచయం చేసి వారి గదికి వెళ్ళమని చెప్పేది నేను అలా వెళ్ళను అని చెప్పగా అమ్మ నన్ను కొట్టేదని షకీలా తెలిపారు.

ఇలా డబ్బు కోసం మొదట మా అమ్మ (Shakeela) నా శరీరాన్ని అమ్ముకుందని ఈ సందర్భంగా షకీలా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా నాలో ఉన్నటువంటి నటన నైపుణ్యాన్ని ఎవరు వాడుకోలేదని కేవలం తన బాడీని చూసి మాత్రమే కెమెరా ముందు నన్ను ఒక కీలుబొమ్మగా నిలబెట్టారు అంటూ ఈ సందర్భంగా షకీలా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus