ఈ ఫోటో క్యూట్ గా కనిపిస్తున్న చిన్నారి.. ఇప్పుడో టాప్ హీరోయిన్.. ఎవరో కనిపెట్టండి..!

  • December 6, 2022 / 07:59 PM IST

2020 లో లాక్ డౌన్ పడినప్పటి నుండి ‘త్రో బ్యాక్’ ఫోటోల సందడి ఎక్కువయ్యింది. ఇప్పటికీ అది కొనసాగుతూనే వస్తోంది. మరీ ముఖ్యంగా గురువారం వచ్చిందంటే చాలు చాలా మంది జనాలు తమ గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఫోటోలు షేర్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విషయంలో సెలబ్రెటీలు మరీ ముఖ్యంగా హీరోయిన్లు.. తమ చిన్ననాటి ఫోటోలు,వీడియోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. వాళ్ళు షేర్ షేర్ చేసిన ఫోటోలు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి.

ఆ ఫోటోలను షేర్ చేస్తూ కొంతమంది నెటిజన్లు పజిల్స్ కూడా నిర్వహిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో వైరల్ అవుతుంది. ఇందులో అద్దంలో చూసుకుంటూ ఆ పాప మురిసిపోతుంది. ఆ హీరోయిన్ ఎవరో ఈపాటికి మీరు కనిపెట్టేసుంటారు. ఆమె మరెవరో కాదు ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన షాలిని పాండే. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్న ఈమె ఆ తర్వాత ‘118’ ‘మహానటి’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది.

కానీ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాలు ఈమెకు చేదు అనుభవాన్ని ఇచ్చాయి. ప్రస్తుతం ఈమె బాలీవుడ్లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ‘అర్జున్ రెడ్డి’ టైంలో బొద్దుగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు బక్క చిక్కి పోయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈమెకు 1.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి.. నిత్యం తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus