శంక‌ర్ హీరోగా ‘శంభో శంక‌ర‌’

  • February 13, 2018 / 10:36 AM IST

ఆర్.ఆర్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌కుడిగా శంక‌ర్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మిస్తోన్న ఓ చిత్రానికి
మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా `శంభో శంక‌ర` అనే పేరును టైటిల్ గా ఖ‌రారు చేశారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ ఎన్ మాట్లాడుతూ, ` నా క‌థ‌ను , న‌న్ను న‌మ్మి, తొలి అవ‌కాశ‌మిచ్చిన నా ప్రియ మిత్రుడు శంక‌ర్ కు ముందుగా నా కృత‌జ్ఞ‌త‌లు. మా ఇద్ద‌ర్నీ న‌మ్మి నిర్మాత‌లుగా ముందుకు వ‌చ్చిన వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి కి కృత‌జ్ఞ‌త‌లు. అలాగే ఈ సినిమాకు ప్రాణం పెట్టి సంగీతాన్ని అందిస్తోన్న సాయి కార్తీక్ కు నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాధాలు. అలాగే ఈ సినిమాకి ఫోటోగ్ర‌ఫీని అందిస్తోన్న రాజ‌శేఖ‌ర్ కు మ‌రియు ఇత‌ర టెక్నీషియ‌న్ల‌కు, నా టీమ్ అంద‌రికీ నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.

చిత్ర క‌థానాయ‌కుడు శంక‌ర్ మాట్లాడుతూ, ` నేను హీరోగా ప‌రిచ‌యం కావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో క‌థ‌లు విన్న త‌ర్వాత నేను హీరోగా ఈ క‌థ అయితే బాగుంటుంద‌నే ఉద్దేశంతో చేస్తున్న చిత్ర‌మిది. న‌న్ను న‌టుడిగా ఆద‌రించిన ప్రేక్ష‌కులు హీరోగా కూడా ఈ సినిమాతో ఆశీర్వ‌దిస్తార‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాకి ప‌నిచేస్తున్న 24 శాఖ‌ల‌కు సంబంధించిన వారంద‌రికీ నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా` అని అన్నారు.

చిత్ర నిర్మాత వై. ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ, ` ఇప్ప‌టివ‌ర‌కూ డ‌బ్బై శాతం షూటింగ్ తో పాటు, ఒక భారీ పైట్, అద్భుతంగా హీరో ఇంట‌ర‌డ‌క్ష‌న్ పాట‌ను చిత్రీక‌రించాం. హీరో శంక‌ర్, ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్, మ‌రో నిర్మాత సురేష్ కొండేటి స‌హ‌కారంతో అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా షూటింగ్ పూర్తిచేయ‌గ‌ల్గుతున్నాం` అని అన్నారు.

మ‌రో నిర్మాత ఎస్. కెపిక్చ‌ర్స్ అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ, ` మంచి క‌థ‌తో నిర్మిస్తున్న అద్భుత‌మైన చిత్ర‌మిది. హీరో శంక‌ర్, మేకింగ్ ప‌రంగా, హై టెక్నిక‌ల్ వాల్యూస్ తో తెర‌కెక్కిస్తున్నాం. నా నిర్మాత‌ల వై. ర‌మ‌ణారెడ్డి తో క‌లిసి నిర్మిస్తున్న చిత్ర‌మిది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే విధంగా ఈ సినిమాని నిర్మించ‌డం జ‌రుగుతోంది. ఈనెఖ‌రుక‌ల్లా షూటింగ్, మార్చి నెల‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తిచేసి వేస‌వి కానుక‌గా విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తాం` అని అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus