టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ డైరెక్టర్ గా శంకర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు శంకర్ కు క్రేజ్ పెరుగుతుండగా శంకర్ రెమ్యునరేషన్ 40 నుంచి 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. శంకర్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు ఇండియన్2 సినిమాలతో బిజీగా ఉండగా ఈ రెండు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరోవైపు శంకర్ కూతురు అదితి శంకర్ సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
అదితి శంకర్ కెరీర్ పరంగా సక్సెస్ సాధించి సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఫస్ట్ సినిమాతో యావరేజ్ మార్కులు వేయించుకున్న అదితి శంకర్ మావీరన్ సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ కు జోడీగా అదితి శంకర్ నటించారు. మడోన్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుండగా ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో అయితే పెద్దగా ఆసక్తి లేదు.
అదితి శంకర్ ఈ సినిమాకు 25 లక్షల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్నారని సమాచారం అందుతోంది. అదితి శంకర్ ఈ సినిమాలో జర్నలిస్ట్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. శంకర్ వల్లే అదితికి సినిమా ఆఫర్లు వస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అదితి శంకర్ మాత్రం వైరల్ అయిన వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు.
నాన్న (Shankar) డైరెక్షన్ లో నటించాలని ఉందని డైరెక్షన్ చేయాలనే ఆలోచన మాత్రం లేదని అదితి శంకర్ చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో అయినా అదితి రెమ్యునరేషన్ పెరుగుతుందేమో చూడాలి. అదితికి రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మేలు జరుగుతుందేమో చూడాలి. అదితిని అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.