Sharwanand: శర్వానంద్ భార్య రక్షిత ప్రెగ్నెన్సీ వార్తల్లో నిజమెంత?

  • November 6, 2023 / 09:33 PM IST

టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోల్లో శర్వానంద్ కూడా ఒకడు. కెరీర్ ప్రారంభంలో చిన్న సినిమాల్లో నటించి, తర్వాత పెద్ద హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వచ్చిన శర్వానంద్ ని.. ‘గమ్యం’ ‘జర్నీ’ ‘ప్రస్థానం’ వంటి సినిమాలు హీరోగా నిలబెట్టాయి. అయితే శర్వానంద్ కి కమర్షియల్ సక్సెస్ అందించిన సినిమాలు యూవీ క్రియేషన్స్ సంస్థలోనే రూపొందాయి. ‘రన్ రాజా రన్’ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ‘మహానుభావుడు’ వంటి చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ అందుకున్నాయి.

ఇక ‘శతమానం భవతి’ సినిమా అయితే శర్వానంద్ (Sharwanand) మార్కెట్ ను పెంచింది అని చెప్పాలి. ఇక ‘ఒకే ఒక జీవితం’ తర్వాత శర్వానంద్ కొంత గ్యాప్ తీసుకున్నాడు.ఒకప్పుడు ఫాస్ట్ గా సినిమాలు చేసిన శర్వానంద్.. ఇప్పుడు సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది శర్వానంద్.. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 3న జైపూర్లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది.

డెస్టినేషన్ వెడ్డింగ్ గా కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నాడు. మరోపక్క తన ఫ్యామిలీ లైఫ్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అదేంటి అంటే.. శర్వానంద్ – రక్షిత దంపతులు త్వరలో పేరెంట్స్ గా ప్రమోట్ కానున్నారట. రక్షిత ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఈ విషయాన్ని వారు అధికారికంగా అయితే ప్రకటించలేదు. చూడాలి మరి..!

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus