ప్రేమికుల రోజు పోటీపడనున్న శర్వా మరియు విజయ్

ప్రేమికుల రోజున రెండు ప్రేమ కథా చిత్రాలు పోటీపడనున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ అలాగే శర్వానంద్, సమంత నటించిన జాను చిత్రాలు ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు బాక్సాపీస్ వద్ద పోటీపడే అవకాశం కలదు. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ప్రేమికుల రోజు విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. కాగా జాను చిత్ర నిర్మాతలు కూడా అదే రోజు విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో రెండు ప్రేమ కథా చిత్రాలు ఒకే రోజు విడుదలైతే పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

కొద్దిరోజుల క్రితం వరల్డ్ ఫేమస్ లవర్ చిత్ర టీజర్ విడుదలైంది. విజయ్ దేవరకొండ నలుగురు అమ్మాయిలతో వివిధ నేపధ్యాలు మరియు గెటప్స్ లో కనిపించి చిత్రంపై ఆసక్తి పెంచేశారు. స్కిన్ షోకి ఆమడ దూరం ఉండే రాశి ఖన్నా బోల్డ్ రోల్ చేసి అందరినీ షాక్ కి గురిచేసింది. టీజర్ లో ముఖ్యంగా వీరిద్దరి లుక్స్ అండ్ రోల్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక తమిళ హిట్ మూవీ 96 కి రీమేక్ గా వస్తున్న చిత్రం జాను. నేడు ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. విడిపోయి కలిసిన ఇద్దరు ప్రేమికుల సున్నితమైన ప్రేమ కథగా జాను తెరకెక్కుతుంది. విడుదలైన టీజర్ లో సమంత, శర్వాల నటన మరియు టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కట్టిపడేశాయి. జాను చిత్రంతో శర్వా-సమంత ల జంట హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది.ఐతే ఈ చిత్ర విడుదల తేదీపై ఖచ్చితమైన స్పష్టత ఇవ్వలేదు. దీనితో ఈ రెండు చిత్రాలు ఫెబ్రవరి 14న విడుదల అవుతాయనే గ్యారంటీ లేదు. ఒకవేళ రెండు ఒకే రోజు విడుదలైతే పోటీ రసవత్తరంగా ఉంటుంది.

దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus