టాలీవుడ్ హీరో శర్వానంద్.. ఈ మధ్యనే పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని శర్వానంద్ వివాహం చేసుకున్నాడు. రక్షిత.. చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, శ్రీకాళహస్తి నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు. రక్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి సోదరుడు గంగారెడ్డి.. బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అల్లుడు .
ఆ విధంగా రక్షిత రెడ్డి.. గోపాలకృష్ణా రెడ్డికి మనవరాలు అవుతుందన్నమాట. ఇక శర్వానంద్ – రక్షిత రెడ్డి ల నిశ్చితార్థ వేడుక జనవరి 26న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాంచరణ్ – ఉపాసన, సిద్దార్థ్ – అదితి రావు హైదరి… వంటి వారు కూడా హాజరయ్యారు. ఇక వీరి పెళ్లి జూన్ 3న జైపూర్లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. రాంచరణ్, సిద్ధార్థ్ , అదితి రావు హైదరి వంటి వారు కూడా శర్వానంద్ పెళ్ళిలో సందడి చేశారు.
ఇక జూన్ 9 న (Sharwanand) శర్వానంద్ – రక్షిత రెడ్డి ల వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న ఎన్ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాంచరణ్, వెంకటేష్, బాలకృష్ణ, అల్లరి నరేష్,నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, అల్లు శిరీష్, జీవిత రాజశేఖర్, శివాని, శివాత్మిక వంటి వారు హాజరయ్యారు. ఇక పెళ్ళైన తర్వాత శర్వానంద్ తన భార్యతో గడుపుతున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉన్నాడు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :