శర్వానంద్‌ హీరోగా `శతమానం భవతి` ప్రారంభం

  • August 27, 2016 / 06:15 AM IST

శర్వానంద్‌ హీరోగా సతీష్‌ వేగ్నేశ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ ప్రొడక్షన్‌ నెం.24 కొత్త చిత్రం ‘శతమానంభవతి’. ఈ సినిమా శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని దిల్‌రాజు కార్యాలయంలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్సియర్‌ సత్యరంగయ్య క్లాప్‌ కొట్టగా, సత్య రంగయ్య మనవడు రంగ యశ్వంత్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. సత్య రంగయ్య తనయుడు ప్రసాద్‌ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం…

దిల్‌రాజు మాట్లాడుతూ – ”మా బ్యానర్‌లో ప్రొడక్షన్‌ నెం.24 చిత్రంగా ‘శతమానం భవతి’ సినిమా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కథ మూడు తరాలకు సంబంధించింది. మాకు బాగా కావాల్సిన సత్య రంగయ్యగారు, ఆయన కుమారుడు ప్రసాద్‌, మనవడు చేతుల మీదుగా సినిమాను లాంచ్‌ చేశాం. సెప్టెంబర్‌ 14 నుండి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. నవంబర్‌కంతా చిత్రీకరణను పూర్తి చేస్తాం. తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి14న విడుదల చేస్తున్నాం. సాధారణంగా పెద్దలు ఆశీర్వదించేటప్పుడు చెప్పే ‘శతమానం భవతి’ అనే టైటిల్‌లోనే ఒక పాజిటివ్‌ వైబ్రేషన్‌ ఉంది. దీన్ని యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌ అందరికీ నచ్చేలా స్క్రిప్ట్‌ సిద్ధం చేశాం. డైరెక్టర్‌ సతీష్‌ వేగ్నేశ, హరీష్‌ శంకర్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసేటప్పుడు నుండి పరిచయం. తను చెప్పిన పాయింట్‌ను అందరికీ నచ్చేలా స్క్రిప్ట్‌ తయారు చేయడానికి టైం పట్టింది. హాలీవుడ్‌లో సినిమా స్క్రిప్ట్‌ సిద్ధమైతే 90 శాతం పూర్తయ్యిందనే నానుడి ఉంది. అలాంటి మంచి స్క్రిప్ట్‌ కోసం, మంచి సినిమాను తీయాలని డైరెక్టర్‌ సతీష్‌ వేగ్నేశ చాలా కష్టపడ్డాడు. హీరో శర్వానంద్‌ హీరో కావాలనుకున్నప్పుడు డైరెక్టర్‌ తేజకు తనని నేనే పరిచయం చేశాను. పన్నెండేళ్ళ తర్వాత ఇప్పుడు శర్వానంద్‌ మా బ్యానర్‌లో సినిమా చేయాలని రాసి పెట్టి ఉందేమో. ఈ శతమానంభవతిలో తను హీరోగా చేయడం చాలా హ్యాపీగా ఉంది. చాలా పాజిటివ్‌గా సినిమాను సంక్రాంతి పండుగకి ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.

చిత్ర దర్శకుడు సతీష్‌ వేగ్నేశ మాట్లాడుతూ – ”సాధారణంగా ఏ సినిమానైనా స్టార్‌ చేసేటప్పుడు ఈ సినిమాలోని పాత్రలు కల్పితం అని వేస్తారు. కానీ మా ‘శతమానంభవతి’సినిమా కల్పితం కాదు..జీవితం. ఒక జీవితానికి సంబంధించిన విషయాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. దిల్‌రాజుగారు నాకు అవకాశం ఇవ్వడమే కాకుండా ఈ కథకు శతమానంభవతి అనే టైటిల్‌ అయితే బావుంటుందని కూడా ఆయన సజెస్ట్‌ చేశారు. శతమానంభవతి అంటే ఆశీర్వాదం..కాబట్టి ఆయన టైటిల్‌తోనే నన్ను ఆశీర్వదించారు. అలాగే ఆయన చెప్పిన కరెక్షన్‌ వల్లే సినిమా స్క్రిప్ట్‌ బాగా వచ్చింది. వచ్చే సంక్రాంతికి మా ‘శతమానంభవతి’ సినిమా ప్రేక్షకులందరినీ అలరిస్తుంది” అన్నారు.

https://www.youtube.com/watch?v=08YLiFa2Z9Q

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus