Puneeth Rajkumar: ఆమె తట్టుకోలేదని పునీత్ మరణవార్తను దాచిపెట్టారా?

ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణించి దాదాపుగా ఆరు నెలలైనా ఆయన అభిమానులు మాత్రం ఆయనను మరిచిపోలేకపోతున్నారు. పునీత్ కష్టాల్లో ఉన్న ఎంతోమందిని ఆదుకోవడంతో పాటు తను చేసిన సహాయ కార్యక్రమాల ద్వారా మరణానంతరం వార్తల్లో నిలిచారు. పునీత్ మరణ వార్త తెలిసి కొంతమంది అభిమానులు చనిపోయారు. ఈరోజు పునీత్ నటించిన చివరి సినిమా జేమ్స్ థియేటర్లలో విడుదలైంది. పునీత్ చివరి సినిమా కావడంతో పునీత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు పాజిటివ్ గా రివ్యూలు ఇస్తున్నారు.

Click Here To Watch Now

అయితే పునీత్ మేనత్త నాగమ్మకు మాత్రం పునీత్ మరణ వార్త ఇప్పటికీ తెలియదని సమాచారం. ఈరోజు పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు కాగా పునీత్ మరణవార్త గురించి మేనత్త నాగమ్మకు చెప్పకపోవడానికి ముఖ్యమైన కారణమే ఉంది. పునీత్ అన్నయ్యకు గుండెపోటు వచ్చిన వార్త తెలిసి గతంలో నాగమ్మ షాక్ కు గురి కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. పునీత్ లేడనే నిజం తెలిస్తే నాగమ్మ తట్టుకోలేదని భావించి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని దాచేశారని తెలుస్తోంది.

నాగమ్మ పునీత్ గురించి అడిగితే పునీత్ అవుట్ డోర్ షూటింగ్ లో బిజీగా ఉన్నడని కుటుంబ సభ్యులు ఆమెకు చెబుతున్నారు. నాగమ్మ ఇంటికి ఎవరైనా వచ్చినా పునీత్ గురించి ఆమె దగ్గర మాట్లాడవద్దని కుటుంబ సభ్యులు చెబుతున్నారని సమాచారం. పునీత్ మేనత్త గాజనూర్ లో ఉంటారని సమాచారం. పునీత్ మేనత్తకు సోషల్ మీడియాపై, యూట్యూబ్ పై పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల ఆమెకు పునీత్ మరణం గురించి తెలియలేదు. మరోవైపు ఐదు భాషల్లో విడుదలైన జేమ్స్ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

క్రిటిక్స్ సైతం జేమ్స్ సినిమా గురించి పాజిటివ్ గానే ప్రమోట్ చేస్తున్నారు. పునీత్ మరణించినా సినిమాల ద్వారా సేవా కార్యక్రామాల ద్వారా ఆయన ఎప్పటికీ తమ మనస్సులో జీవించి ఉంటాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus