కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ ఒకరు కాగా అనిరుధ్ పారితోషికం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. విక్రమ్, జైలర్ సినిమాల సక్సెస్ తో అనిరుధ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. అయితే లియో సినిమా మ్యూజిక్ విషయంలో అనిరుధ్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సినిమా బీజీఎం విషయంలో అయినా అనిరుధ్ కు మంచి మార్కులు పడతాయో లేదో చూడాల్సి ఉంది. అయితే అనిరుధ్ తర్వాత మూవీ దేవర భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
దేవర సినిమాతో అనిరుధ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. దేవర రిలీజ్ కు ఆరు నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అనిరుధ్ ఈ సినిమాకు ఎలాంటి సాంగ్స్ ఇస్తారో చూడాలి. అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ సమయంలో అనిరుధ్ పై వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కావు. ఆ విమర్శలు రిపీట్ కాకుండా అనిరుధ్ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది.
నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్న (Anirudh) అనిరుధ్ కెరీర్ పరంగా మరింత ఎదగాలంటే సాంగ్స్, బీజీఎం విషయంలో ఎలాంటి విమర్శలు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంది. అనిరుధ్ రేంజ్ వేరే లెవెల్ అని అయితే కొన్నిసార్లు అనిరుధ్ క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల విమర్శలు తప్పడం లేదని తెలుస్తోంది. అనిరుధ్ టాలీవుడ్ లో కూడా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ స్థాయికి ఎదుగుతారో లేదో చూడాల్సి ఉంది.
అనిరుధ్ కు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. అనిరుధ్ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. తన సినిమాలలో ప్రతి సాంగ్ సక్సెస్ సాధించేలా అనిరుధ్ జాగ్రత్త పడాలి. ఎన్టీఆర్ సినిమా తెలుగులో అనిరుధ్ జాతకాన్ని మారుస్తుందేమో చూడాలి.