Adipurush: దేవుడా.. ఆదిపురుష్ మూవీ సెకండ్ సాంగ్ ను అలా ప్లాన్ చేశారా?

ప్రభాస్ రాముని పాత్రలో కృతిసనన్ సీత పాత్రలో నటించిన ఆదిపురుష్ మూవీ రిలీజ్ కు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన జై శ్రీరామ్ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జకన్న రానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే రాజమౌళి నిజంగా ఈ ఈవెంట్ కు హాజరవుతారో లేదో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే. అయితే ఆదిపురుష్ సెకండ్ సాంగ్ కోసం ప్రచారాన్ని వేరే లెవెల్ లో ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. ఈ నెల 29వ తేదీన సెకండ్ సింగిల్ రిలీజ్ కానుందని బోగట్టా. ఆరోజు మధ్యాహ్నం 12 గంటలకు థియేటర్స్, వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్ తో పాటు 70కుపైగా రేడియో స్టేషన్స్ లో ఈ సాంగ్ రిలీజ్ కానుందని సమాచారం.

నేషనల్ మీడియా, మ్యూజిక్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్, నేషనల్ మీడియాలో కూడా ఈ సాంగ్ కు అదే సమయంలో వినిపించబోతున్నారని సమాచారం అందుతోంది. ఏ రాష్ట్రంలో ఆ భాషలో ఈ సాంగ్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ స్థాయిలో ఒక సాంగ్ కోసం ప్రచారం జరగడం కేవలం (Adipurush) ఆదిపురుష్ మూవీ విషయంలోనే జరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

రామ్ సియా రామ్ అనే లిరిక్స్ తో ఉండే ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి రచించారు. సచేత్ పరంపర కంపోజ్ చేసిన ఈ పాట ఆదిపురుష్ కు కచ్చితంగా ప్లస్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ మూవీ 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus