Chiranjeevi: చిరంజీవి మేనరిజమ్స్ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

  • October 25, 2023 / 11:29 PM IST

మెగాస్టార్ చిరంజీవి వయస్సు పెరుగుతున్నా ఆయన ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. చిరంజీవి వశిష్ట కాంబో మూవీ 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ టైటిల్ గతంలో చరణ్ శంకర్ కాంబో మూవీ కోసం పరిశీలించిన టైటిల్ కావడం గమనార్హం. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన పలు సినిమాలలో ఆయన మేనరిజమ్స్ హైలెట్ అయ్యాయి.

ఆ మేనరిజమ్స్ ఈ సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. కొండవీటి రాజా సినిమాలో చిరంజీవి ఠ్ఠ్ దెబ్బకాయ్ అని చెబుతారు. ఆ శబ్దం ఆ సినిమాకు హైలెట్ గా నిలిచింది. అయితే చిరంజీవి ఠ్ఠ్ అనే శబ్దాన్ని సరిగ్గా పలకలేకపోయారట. నిర్మాత కేఎస్ రామారావు ఆ శబ్దాలను కరెక్ట్ గా పలకడంతో చిరంజీవి కేఎస్ రామారావుతో ఠ్ఠ్ అని పలికించి దెబ్బకాయ్ అని ఆయన చెప్పారు.

ఒక సినిమాలో (Chiranjeevi) చిరంజీవి విజయశాంతితో “జమ్కు జమ.. లస్కు టపా” అనే డైలాగ్ చెప్పగా ఆ పదాలకు అర్థం చెప్పమని విజయశాంతి అడగడంతో రాఘవేంద్రరావును అడగాలని చిరంజీవి సూచించారు. ఆ సమయంలో రాఘవేంద్ర రావు “నీ అంద చందాలకు దాసుడినైపోయాను” అనే అర్థం చెప్పారట. ఆ తర్వాత చిరంజీవి రాఘవేంద్రరావును ఆ ఆర్థం నిజమేనా అని అడగగా దానికి అర్థం “కాదు.. నిన్ను ఎలా పడేస్తానో చూడు” అని చెప్పాడట.

ఘరానా మొగుడు సినిమాలో “ఫేస్ కాస్త లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి” డైలాగ్ మేనరిజమ్ పాపులర్ కాగా చిరంజీవి “బాక్స్ బద్ధలైపోతుంది” మేనరిజమ్ కూడా ఊహించని స్థాయిలో పాపులర్ అయింది. చిరంజీవి రెమ్యునరేషన్ విషయానికి వస్తే 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. చిరంజీవి క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus