నాగచైతన్య సమంత కాంబినేషన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్రేజీ కాంబినేషన్లలో ఒకటి కాగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో ఆటో నగర్ సూర్య మినహా మిగతా సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేయగా పెళ్లైన నాలుగేళ్లకే విడిపోయి అభిమానులకు వాళ్లు ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైతన్య, సమంత వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. చైతన్య, సమంత ఒకే వేదికపై కనిపించడానికి కూడా ఇష్టపడటం లేదు. చైతన్య, సమంత విడిపోవడం వల్ల చైతన్య, సమంత అభిమానులు సైతం విడిపోయారు.
చై సినిమాలు విడుదలైన సమయంలో సమంత అభిమానులు సామ్ సినిమా విడుదలైన సమయంలో చైతన్య అభిమానులు నెగిటివ్ గా ప్రచారం చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. ఈ మధ్య కాలంలో చైతన్య సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే సమంత చైతన్య విడిపోయి సంవత్సరాలు గడుస్తున్న సమంత C అనే అక్షరంతో ఉన్న పచ్చబొట్టును చెరిపేయలేదు.
సమంత మనస్సులో చైతన్య ఉన్నాడని అందుకే ఆ పచ్చబొట్టును ఇంకా అలాగే ఉంచుకుందని కామెంట్ చేస్తుండగా మరి కొందరు మాత్రం టాటూ రిమూవ్ చేయడం సులువు కాదని అందుకే ఆమె టాటూను అలాగే ఉంచుకుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైతన్యతో పెళ్లి సమయంలో సమంత ఆ టాటూను వేయించుకున్న సంగతి తెలిసిందే. సమంత ప్రస్తుతం ఖుషి సినిమాతో పాటు సిటాడెల్ వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్నారు.
ఈ రెండు ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధిస్తే సమంతకు పూర్వ వైభవం వస్తుందని చెప్పవచ్చు. కెరీర్ పరంగా సమంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. డిమాండ్ కు అనుగుణంగా సమంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. చైసామ్ కలిసి నటించే ఛాన్స్ ఎప్పటికీ లేదని సమాచారం అందుతోంది.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?