Game Changer: చరణ్ అభిమానుల కరువును తీర్చే మూవీ ఇదేనా.. ఏం జరిగిందంటే?

చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి అతి త్వరలో జరగండి జరగండి సాంగ్ రిలీజ్ కానుంది. ఈ సాంగ్ కోసం ఏకంగా 16 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా థమన్ కెరీర్ కు ఈ సినిమా కీలకం కానుందని తెలుస్తోంది. చరణ్ అభిమానుల కరువును తీర్చే మూవీ ఇదేనని అభిమానులు ఫీలవుతున్నారు.

చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని అద్భుతమైన డ్యాన్సర్లలో ఒకరు కాగా చరణ్ డ్యాన్స్ కు సరిపడే సాంగ్స్ ఈ సినిమాలో ఉండనున్నాయని తెలుస్తోంది. చరణ్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ లా ఉండనుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. చరణ్ శంకర్ కాంబో మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

పెద్ద సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి క్లారిటీ వస్తున్న నేపథ్యంలో గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది. నిర్మాత దిల్ రాజు సైతం ఈ సినిమా గురించి స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. శంకర్ షూటింగ్ ను ఆలస్యం చేయడం వల్లే ఈ సినిమాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం అందుతోంది.

శంకర్ ఈ సినిమా (Game Changer) కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయించగా ఈ సినిమాకు బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. ఈ సినిమా చరణ్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచే ఛాన్స్ అయితే ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చరణ్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus