సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని దాదాపు రెండు నెలల కావస్తుంది. ఈ కేసు విచారణ మాత్రం కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజుల క్రితం సుశాంత్ సింగ్ తండ్రి కే కే సింగ్ బీహార్ లో రియా చక్రవర్తిపై కేసు నమోదుచేసిన నాటి నుండి కీలకపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసు విషయంమై బీహార్ పోలీసులు ముంబై రావడంతో పాటు సీరియస్ గా విచారణ చేపడుతున్నారు. ఇక సుశాంత్ బ్యాంకు ఖాతాలు మరియు ఆర్థిక లావాదేవీలపై వీరు దృష్టిసారించారు.
సుశాంత్ నుండి రియా చక్రవర్తి కోట్లలో డబ్బులు దోచుకున్నట్లుగా తెలుస్తుంది. ఆమె కేవలం మూడు రోజులలో సుశాంత్ అకౌంట్ నుండి మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్న అంశం సంచలనం రేపుతోంది. ఇక సుశాంత్ మరణానికి కొద్దిరోజుల ముందు ఆయన ఇంటి నుండి వెళ్ళిపోయిన రియా పెద్ద మొత్తంలో డబ్బు, నగలు దోచుకువెళ్లినట్లు సమాచారం అందుతుంది. ఈ కేసులో బీహార్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.
ఐతే ఆమె వాళ్లకు దొరక్కుండా న్యాయపరమైన దారులు వెతుక్కుంటుంది. ముంబై పోలీసులు రియాను ఉద్దేశపూర్వకంగా కాపాడుతూ కేసును తప్పుదోవపట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక బీహార్ పోలీసులకు సుశాంత్ కేసును ఇన్వెస్టిగేట్ చేసే హక్కు లేదని రియా చక్రవర్తి లాయర్ చెప్పడం విశేషం. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో అనేక దిగ్బ్రాంతికర విషయాలు బయటికి వస్తున్నాయి.
Most Recommended Video
ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!