Rajasekhar, Chiranjeevi: రాజశేఖర్ హిట్ మూవీ వెనుక అసలు కథ ఇదేనా?

ఒకప్పుడు వరుసగా విజయాలను సొంతం చేసుకున్న రాజశేఖర్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలేవీ అంచనాలను అందుకోవడం లేదు. గతేడాది రాజశేఖర్ నటించి విడుదలైన శేఖర్ మూవీ ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. ఈ మధ్య కాలంలో రాజశేఖర్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు కూడా రావడం లేదు. అయితే చాలా సంవత్సరాల క్రితం ఒక సినిమాలో రాజశేఖర్ నటించాలని చిరంజీవి రికమెండ్ చేశారట.

రాజశేఖర్ ఒక సందర్భంలో మాట్లాడుతూ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో ఒరు సీబీఐ డైరీ కురిప్పు సినిమా కూడా ఒకటి. ఈ సినిమా మలయాళంలో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం ద్వారా అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఈ సినిమా రీమేక్ లో నటించాలని రాజశేఖర్ భావించగా అప్పటికే ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ అల్లు అరవింద్ కొనుగోలు చేశారని రాజశేఖర్ కు తెలిసింది.

అయితే ఆ తర్వాత అల్లు అరవింద్ ఈ సినిమాలో నటిస్తావా అని రాజశేఖర్ ను అడగడంతో షాకవ్వడం రాజశేఖర్ వంతు అయింది. ఆ సమయంలో అల్లు అరవింద్ మొదట ఈ సినిమాను చిరంజీవితోనే చేయాలని అనుకున్నామని అయితే కాల్షీట్ల సమస్య వచ్చిందని రాజశేఖర్ కు చెప్పారు. ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే చిరంజీవి మీ పేరును సూచించారని అల్లు అరవింద్ రాజశేఖర్ కు తెలిపారు.

ఈ విధంగా చిరంజీవి వల్ల ఒరు సీబీఐ డైరీ కురిప్పు సినిమా రీమేక్ న్యాయం కోసంలో రాజశేఖర్ నటించి ఈ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోవడం సాధ్యమైంది. రాజశేఖర్ మళ్లీ సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాజశేఖర్ కు ఎన్నో ఆఫర్లు వస్తుండగా ఆ ఆఫర్లను రాజశేఖర్ రిజెక్ట్ చేస్తున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus