పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో కారు.. ట్రెండ్ సెట్ జేస్తారు. ఇది సినిమా డైలాగ్ మాత్రమే కాదు. పవర్ స్టార్ స్టయిలే అంత. ఇప్పటికే ఎన్నోసార్లు ట్రెండ్ సెట్ జేసిన పవన్ కాటమరాయుడు చిత్రం కోసం రెమ్యునరేషన్ తీసుకోకుండా, కొన్ని థియేటర్ ఏరియా హక్కులను తీసుకొని ట్రెండ్ సెట్ జేశారు. పైగా ఇది అత్యధికంగా రేటు పలికిన ఏరియాలు కావడంతో ప్రస్తుతం ఈ వార్త సినీ జనాల్లో హాట్ టాపిక్ అయింది. డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఉగాది కానుకగా మర్చి 24 ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఇప్పటికీ ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 90 కోట్లు చేసింది.
పవన్ గత చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ ఫెయిల్ అయినా కూడా ఈ కాటమరాయుడు పవర్ కొంచెం కూడా తగ్గలేదు. నైజాం థియేటర్ రైట్స్ 25 కోట్లకు అమ్ముడుపోగా, ఓవర్సీస్ రైట్స్ 8.5 కోట్లు పలికాయి. ఈ రెండు కలిపితే 33 కోట్లు. ఈ మొత్తం రెమ్యునరేషన్ కింద పవర్ స్టార్ తీసుకోవడం సంచలనం అయింది. టాలీవుడ్ లో ఇప్పటివరకు ఇన్నికోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న హీరో ఎవరూ లేరు. ఆ రికార్డు కూడా పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.