రెమ్యూనరేషన్ పెంచేసిన సత్యరాజ్..!

గోపీచంద్ ‘శంఖం’, ప్రభాస్ ‘మిర్చి’ ‘బాహుబలి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు సత్య రాజ్. ముఖ్యంగా ‘బాహుబలి’ చిత్రంతో ఇండియా వైడ్ మరింత పాపులర్ అయ్యాడు. మనకి సహా నటుడిగా తెలిసిన సత్యరాజ్ గతంలో హీరో కూడా. కోలీవుడ్ లో రెబల్ స్టార్ గా ఓ వెలుగు వెలిగాడు. అప్పటి రోజుల్లోనే 5 కోట్ల పారితోషికం తీసుకునే వాడంటే ఈయన రేంజ్ ఏంటనేది అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి నటుడు ప్రస్తుతం ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు .. తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు.

ప్రాధాన్యత కలిగిన చిత్రాలనే ఎంచుకుంటూ.. వరుస సినిమాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన ‘జెర్సీ’ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించి మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. ‘జెర్సీ’ చిత్రం సపోర్టింగ్ రోల్ చేసిన సత్య రాజ్ నిజంగా కోచ్ అనే ఫీలింగ్ తెప్పించాడు. ‘జెర్సీ’ చిత్రం ఆయన రేంజ్ ను మరింత పెంచిందని చెప్పాలి. ఇప్పుడు కోలీవుడ్ తో పాటూ.. బాలీవుడ్, టాలీవుడ్ లో ఈయనకి మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన పారితోషికాన్ని కూడా పెంచేసాడని తెలుస్తుంది. పాత్ర నిడివి ఎక్కువ ఉంటే 2 కోట్లు పారితోషికంగా డిమాండ్ చేస్తున్నారట. ఒకవేళ రోజుల వారీగా అయితే.. రోజుకి 3 నుంచి 5 లక్షలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీనికి నిర్మాతలు కూడా ఓకే చెపుతున్నారట, ఈయన ఎటువంటి పరిస్థితుల్లోనూ షూటింగ్ ఎగ్గొట్టరట, నిర్మాతలను కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టరని టాక్ ఉంది. ఇందుకోసమే ఆయన డెడికేషన్, క్యారెక్టర్ చూసి నిర్మాతలు దైర్యంగా ముందుకొస్తున్నట్టు స్పష్టమవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus