ఆ రూమర్స్ గనుక నిజమే అయితే నర్తనశాల ట్రెండ్ సెట్ చేస్తుంది

ఒక్కోసారి సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ కూడా పాజిటివ్ గా మారిపోతుంటుంది. ప్రస్తుతం నాగశౌర్య తాజా చిత్రమైన “@నర్తనశాల”పై వస్తున్న రూమర్స్ కూడా అలానే తయారయ్యాయి. తొలుత ఎన్టీఆర్ నటించిన నర్తనశాలలో ఆయన ట్రాన్స్ జెండర్ గా నటించి ఉండడంతో.. ఈ “@నర్తనశాల”లోనూ నాగశౌర్య ట్రాన్స్ జెండర్ గా నటించనున్నాడని టాక్ వచ్చింది. ఇప్పుడేమో ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్స్ లో ఒకటైన “దోస్తానా” చిత్రానికి రీమేక్ అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ లో నిజమెంత, అబద్ధమెంత అనేది ప్రస్తుతానికి తెలియనప్పటికీ.. ఆ రూమర్స్ పుణ్యమా అని సినిమాకి మాత్రం మంచి బజ్ వస్తోంది.

“ఛలో”తో సూపర్ హిట్ అందుకొన్న నాగశౌర్య ఆ తర్వాత “కణం, అమ్మమ్మగారిల్లు” చిత్రాలతో ఫ్లాప్స్ అందుకొన్నాడు. అయితే.. ఆ రెండు సినిమాలు తాను చేసిన ఎమోషనల్ మిస్టేక్స్ అని ముందే చెప్పిన నాగశౌర్య.. తన స్వంత బ్యానర్ లో చేస్తున్న తాజా చిత్రమైన “@నర్తనశాల”పై చాలా ఆశలు పెట్టుకొన్నాడు. హిలేరియస్ కామెడీతోపాటు ఎమోషనల్ లవ్ స్టోరీ & సెంటిమెంట్స్ సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై శౌర్య భారీ ఆశలే పెట్టుకొన్నాడు. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కష్మర పరదేశీ, యామినీ భాస్కర్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus