‘బల్లేగా దొరికావే బంగారం’ సాంగ్.. కాపీ అంటూ థమన్ పై ట్రోల్స్!

టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు థమన్. ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో అతడి క్రేజ్ మరింత పెరిగింది. అయితే మొదటినుండి కూడా థమన్ ట్యూన్స్ కాపీ అంటూ చాలా విమర్శలు వచ్చాయి. గతంలో చాలా సార్లు థమన్ ఈ విషయంలో ట్రోలింగ్ కి గురయ్యారు. అతడిపై కాపీ క్యాట్ అనే ముద్ర కూడా పడిపోయింది. థమన్ ఎన్ని సార్లు తను కాపీ కొట్టలేదని చెప్పినా.. ఇదిగో కాపీ ట్యూన్ అంటూ ఒరిజినల్ వెర్షన్ ని బయటకి తీస్తున్నారు నెటిజన్లు. తాజాగా మరోసారి థమన్ ట్రోలర్లకు పని చెప్పాడు.

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుండి ‘బల్లేగా దొరికావే బంగారం’ అనే పాట రిలీజ్ అయింది. ఈ పాటకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే థమన్ ఈ పాట ట్యూన్ ని లాటిన్ సినిమా నుండి కాపీ చేశారంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఒరిజనల్‌ వెర్షన్ ‘సెల్వా ఎల్ నియాన్’ ట్యూన్‌ని కూడా షేర్‌ చేస్తున్నారు. బలే దొరికిపోయావ్ థమన్ అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు.

ఎవరు గుర్తుపట్టరనుకొని లాటిన్ సాంగ్ కొట్టేసి దొరికిపోయావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే ‘కింగ్’ సినిమాలో నాగార్జున-బ్రహ్మానందం మధ్య వచ్చే కాపీ సీన్ లో బ్రహ్మీ ప్లేస్ లో థమన్ ఫోటో పెట్టి ట్రోల్ చేస్తున్నారు. తనపై ఇలాంటి ట్రోలింగ్ జరగడం థమన్ కి కొత్తేమీ కాదు. మరి దీనిపై ఈ మ్యూజిక్ డైరెక్టర్ స్పందిస్తాడేమో చూడాలి!


2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus