ఇప్పుడంటే పాటలకోసం ఫారిన్ లొకేషన్లకి వెళ్ళిపోతున్నారు చిత్ర యూనిట్ సభ్యులు లేకపోతే రామోజీ ఫిలింసిటీలోనో.. అన్నపూర్ణ స్టూడియోస్ లోనో సెట్లు వేసేసి తీసేస్తున్నారు. అదికూడా కాదు అంటే… గ్రాఫిక్స్ లో లొకేషన్లని మేనేజ్ చేసేస్తున్నారు. కానీ అప్పట్లో దర్శకుడు కె.రాఘవేంద్రరావు పచ్చని పొలాలు, నదుల మధ్యలో ఎంతో నేచురల్ గా.. అలాగే కలర్ ఫుల్ గా వచ్చేలా చిత్రీకరించేవారు. అలా ఎన్నో క్లాసిక్స్ ఆయన అకౌంట్ లో ఉన్నాయి. అందులో అతిలోక సుందరి శ్రీదేవితో ఆయన తెరకెక్కించిన ‘దేవత’ సినిమాలోని ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ పాట ఒకటి. ఈ పాట ఎవర్ గ్రీన్ క్లాసిక్. ఇప్పటికి ఈ పాటని యూట్యూబ్ లో చూస్తూ ఇప్పటి కుర్రకారు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
అలాంటి పాటని రీమిక్స్ చేయాలని మన పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కు డ్రీం అట. అందుకే ‘వాల్మీకి’ చిత్రంలో ఆ పాటని రీమిక్స్ చేయించాడు. శోభన్ బాబు ప్లేస్ లో వరుణ్ తేజ్, శ్రీదేవి ప్లేస్ లో పూజా హెగ్దే ను పెట్టాడు. ఏకంగా ఈ పాట కోసం 1500 బిందెలు తెప్పించి ఈ పాటని చిత్రీకరించాడు. ‘హరీష్.. దర్శకేంద్రుడిని ఏమాత్రం మ్యాచ్ చేయలేకపోయాడు అనే చెప్పాలి. ఇక శ్రీదేవి గ్లామర్ కి పూజా సగం కూడా మ్యాచ్ చేయలేదనే చెప్పాలి. ఇక వరుణ్ తేజ్ అయితే శోభన్ బాబు లా కాదు నాగబాబు లా ఉన్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి’. హరీష్ డ్రీం అయితే నెరవేర్చుకున్నారు కానీ.. ఈపాటలో శ్రీదేవి ప్లేస్ లో పూజా హెగ్దేను పెట్టినందుకు హరీష్ శంకర్ పై ఓ రేంజ్లో విమర్శలు గుప్పిస్తున్నారు.. నెటిజన్లు. ‘శ్రీదేవితో పూజాకి పోలిక ఏంటి’, ‘ఓ క్లాసిక్ పాటని హరీష్ చెడగొట్టాడు’, ‘ఆల్ టైం హిట్ పాటని నాశనం చేశాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.a
గ్యాంగ్ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి