సినిమా వాళ్ళు.. మరీ ముఖ్యంగా నటీనటులు పెళ్లి గురించి ఎక్కువ ఆలోచించరు. అప్పుడప్పుడే కెరీర్ సెట్ చేసుకునే క్రమంలో.. ఎక్కడ తమ బిజీ లైఫ్ డిస్టర్బ్ అవుతుందో అని పెళ్లిని లైట్ తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే కొంత పర్వాలేదు అనే స్టేజ్ వచ్చిందో. అప్పుడు పెళ్ళికి రెడీ అవుతారు. హీరోయిన్లయితే అవకాశాలు తక్కువైనప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారు. ఇవి అందరికీ తెలిసిన సంగతే. అందుకే సెలబ్రిటీలను పెళ్లి గురించి అడిగితే వాళ్ళు.. ఇలాంటి ఆన్సర్లే ఇస్తారు.
అది తెలిసినా.. పెళ్లి పై వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా మారాయేమో అని మళ్ళీ మళ్ళీ యాంకర్లు అడుగుతూ ఉంటారు. చాలా వరకు తెలిసిన ఆన్సరే వినిపిస్థాయి కానీ.. ఓ స్టార్ హీరో మాత్రం పెళ్లికి డెఫినిషన్ మొత్తం మార్చేశాడు. అతను మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్. బ్లడీ డాడీ సినిమా ప్రమోషన్లో భాగంగా అతను పెళ్లి పై స్పందించాడు. అతను మాట్లాడుతూ.. ‘ పెళ్లి అనేది కేవలం ఒకే ఒక దాని పైనే ఆధారపడి ఉంటుంది.
జీవితం పై క్లారిటీ లేని ఓ అబ్బాయి జీవితంలో ఓ అమ్మాయి వస్తే.. అతన్ని గాడిలో పెడుతుంది, బాధ్యతగల యువకుడిగా మారుస్తుంది, లేదంటే ఆ అబ్బాయి పాడైపోతాడు’ అనే ఉద్దేశంతో మాత్రమే పెద్దలు పెళ్లి చేయాలని అనుకుంటారు’.. అది తప్ప పెళ్లి అనేది అంత ముఖ్యమైనది కాదు’ అన్నట్టు షాహిద్ కపూర్ చెప్పుకొచ్చాడు. అతను చెప్పినదాంట్లో నిజం ఉండొచ్చు కానీ..
అతని (Star Hero) ఉద్దేశం పూర్తిగా కరెక్ట్ కాదు. అందుకే నెటిజన్లు షాహిద్ పై మండి పడుతున్నారు. ‘మీ అమ్మ.. మీ నాన్నని అలాగే దారిలో పెట్టిందా?’ ‘అంటే పెళ్లి చేసుకున్న వాళ్లంతా పనికిమాలిన వాళ్ళా’ ‘నీకు తప్ప ఇంకెవ్వరికీ బాధ్యత లేదా’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో ఈ టాపిక్ కాస్త వైరల్ గా మారింది. మరి ఈ ట్రోలింగ్ కి షాహిద్ కపూర్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు