నాగచైతన్య, సమంతలు విడిపోవడంపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కొందరు సమంతను బ్లేమ్ చేస్తుంటే మరికొందరు నాగచైతన్యను బ్లేమ్ చేస్తున్నారు. అయితే సమంతకు మహిళా నటుల నుంచి మద్దతు లభిస్తుండడం విశేషం. సమంతకు సపోర్ట్ చేస్తున్నవారిలో నటి మాధవీలత కూడా ఉన్నారు. తాజాగా అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించిన మాధవీలత.. చై-సామ్ డివోర్స్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. సమంత చాలా మంచి అమ్మాయని సర్టిఫికెట్ ఇచ్చారు.
విడాకులకు సమంతే కారణమంటూ 99 శాతం మంది అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సమంతపై బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గ్లామర్ బట్టలు ధరించడం వలనే సమంతకు చైతన్య విడాకులు ఇచ్చారనడంలో నిజం లేదని అన్నారు. తెరపై కనిపిస్తే దుస్తులకు, దంపతుల సంసారానికి ఏ మాత్రం సంబంధం ఉండదని స్పష్టం చేశారు. సమంత డబ్బు మనిషి కాదని.. సినిమాల ద్వారా సంపాదించే డబ్బును ఏం చేయాలో ఆమెకి తెలియదని అన్నారు.
గతంలో సమంతను ఓ హీరో ట్రాప్ చేశాడని.. డబ్బు కోసం ఆమెని వాడుకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు మాధవీలత. ఆ విషయం తెలిసి సమంత అతడికి దూరమైందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మాధవీలత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.