Bhola Shankar: భోళా శంకర్ నుంచి షాకింగ్ అప్డేట్ ఇచ్చిన మెహర్ రమేష్.. కానీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతంగా కథ చెప్పగల అతికొద్ది మంది డైరెక్టర్లలో మెహర్ రమేష్ ఒకరు. ప్రభాస్, ఎన్టీఆర్, వెంకటేష్ సినిమాలకు దర్శకత్వం వహించిన మెహర్ రమేష్ త్వరలో భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్టార్ హీరోలను స్టైలిష్ గా చూపించిన ఈ దర్శకుడు బిల్లా సినిమాతో యావరేజ్ హిట్ ను సొంతం చేసుకున్నా మిగతా సినిమాలతో భారీ డిజాస్టర్లు ఇచ్చారు. ఈ సినిమాలు నిర్మాతలకు సైతం మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో నష్టాలను మిగిల్చాయి.

అయితే భోళా శంకర్ (Bhola Shankar) తో మెహర్ రమేష్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. భోళా శంకర్ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైందని మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. త్వరలో భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయనే సంగతి తెలిసిందే.

ఆగష్టు నెల 11వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటిస్తుండగా ఈ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనున్నారు. అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తుండగా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. వరుస విజయాలతో జోరుమీదున్న చిరంజీవి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

చిరంజీవి పారితోషికం ప్రస్తుతం 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. చిరంజీవి తర్వాత సినిమాలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మెగాస్టార్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి ఛాన్స్ ఇవ్వడంతో ఆ రుణాన్ని మెహర్ రమేష్ తీర్చుకుంటాడేమో చూడాల్సి ఉంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus