Nandamuri Mokshagna: మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ షాకింగ్ అప్ డేట్ వైరల్.. షూట్ అప్పుడేనా?

  • July 19, 2024 / 08:33 PM IST

నందమూరి మోక్షజ్ఞకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) డైరెక్షన్ లో తెరకెక్కనుందని కొన్నిరోజుల క్రితం క్లారిటీ వచ్చింది. హనుమాన్ (Hanu Man)  సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మపై కాన్ఫిడెన్స్ తో బాలయ్య (Balakrishna)  ప్రశాంత్ వర్మను నమ్మి ఛాన్స్ ఇచ్చినట్టు భోగట్టా. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతో ఎలాంటి కథను తెరకెక్కిస్తారనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది. సెప్టెంబర్ 6వ తేదీన మోక్షజ్ఞ పుట్టినరోజు కాగా ఆరోజు ఈ సినిమాకు సంబంధించి అధికారిక అప్ డేట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యకమవుతున్నాయి.

దసరా పండుగ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని నవరాత్రుల సమయంలో మంచి ముహూర్తం చూసి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేలా బాలయ్య ప్లానింగ్ ఉందని తెలుస్తోంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా అంచనాలను అందుకునేలా ఉన్న ఏ అవకాశాన్ని బాలయ్య మిస్ చేసుకోవడం లేదని తెలుస్తోంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో బాలయ్య కనిపించే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

మోక్షజ్ఞను స్టార్ హీరోగా నిలబట్టడానికి బాలయ్య తన వంతు ప్రయత్నాలు పూర్తిస్థాయిలో చేస్తుండటం గమనార్హం. పొలిటికల్ గా సైతం అనుకూల పరిస్థితులు ఉండటంతో బాలయ్య మోక్షజ్ఞ లాంఛ్ కు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు  (Jr NTR) పాన్ ఇండియా ఇమేజ్ ఉండటం మోక్షజ్ఞకు ఒక విధంగా ప్లస్ అవుతోంది. మోక్షజ్ఞ ఇప్పటికే యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నారని తెలుస్తోంది. నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ పుష్కలంగా ఉండటంతో మోక్షజ్ఞ బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మోక్షజ్ఞ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus