Shraddha Kapoor: ప్రభాస్‌ నాయిక రిలేషన్‌ గురించి చెప్పలేదు కానీ.. బ్రేకప్‌ గురించి చెబుతోందా?

భయపెట్టి డబ్బులు సంపాదించడం ఒక ఆర్ట్‌. ఇదేంటి ఇలా చెబుతున్నారు అనుకుంటున్నారా? మేం చెబుతున్నది సినిమాల గురించే లెండి. సినిమాల్లో దెయ్యం అంటూ భయపెట్టి హిట్‌ కొట్టడం, వసూళ్లు సంపాదించడం ఆర్టే కదా. ఈ పనిని ఇటీవల బాగా చేసి అదిరిపోయే విజయం, ఊహించని వసూళ్లు అందుకుందాఇ శ్రద్ధ కపూర్? ‘స్త్రీ 2’ సినిమాతో ఇటీవల విజయాన్ని అందుకున్న శ్రద్ధ కపూర్‌ (Shraddha Kapoor) తాజాగా చేసిన కొన్ని కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

Shraddha Kapoor

బాలీవుడ్‌కి రూ.వంద కోట్ల సినిమాలు అంటే గగనం అనుకుంటున్న సమయంలో స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ వరుసగా రెండు సార్లు ఏకంగా రూ.వెయ్యి కోట్లు తెచ్చి చూపించాడు. ఇప్పుడు హీరోయిన్‌గా నేనేమన్నా తక్కువా అంటూ శ్రద్ధ కూడా తెచ్చింది. ఆ ఆనందంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. అలా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడిపడానికి అందరిలా నేనూ ఇష్టపడతాను.

కలసి సినిమాలు చూడటం, డిన్నర్‌కి వెళ్లడం, ప్రయాణాలు చేయడం అంటే నాకూ ఇష్టమే. అలాగే పెళ్లి చేసుకున్నామా లేదా అనే దాని కంటే.. సరైన వ్యక్తితో జీవితాన్ని కొనసాగిస్తున్నామా లేదా అనేది ఎంతో ముఖ్యం అని శ్రద్ధ కుండబద్ధలు కొట్టింది. అయితే ఆ మాటల వెనుక చాలా పెద్ద అర్థం ఉంది అంటున్నారు.బాలీవుడ్‌ రచయిత రాహుల్‌తో శ్రద్ధ కపూర్‌ రిలేషన్‌లో ఉందంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఇద్దరూ కలసి పార్టీలకు హాజరైన ఫొటోలూ కనిపించాయి.

అయితే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్‌ను శ్రద్ధ కపూర్‌ అన్‌ఫాలో చేసింది. దీంతో వీరు విడిపోయారు అనే చర్చ మొదలైంది. సరిగ్గా ఈ సమయంలో ‘సరైన వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నామా? లేదా? అనేది ముఖ్యం’ అని అనడంతో ఏదో తేడాకొడుతోంది అని అంటున్నారు నెటిజన్లు. ప్రభాస్‌ ‘సాహో’ సినిమాతో తెలుగు వారికి బాగా దగ్గరైన శ్రద్ధ ఆ తర్వాత మళ్లీ ఇక్కడి సినిమా ఓకే చేయలేదు. భవిష్యత్తులో ఏమన్నా ఓకే చేస్తుందేమో చూడాలి.

మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus