రామాయణంలో నేను నటించడం లేదు: శ్రద్ధాకపూర్

అప్పటివరకూ కాస్త స్లోగా సాగిన శ్రద్ధాకపూర్ కపూర్ కెరీర్ కి “సాహో, చిచోరే” లాంటి సినిమాలు మంచి బూస్ట్ ఇచ్చాయి. ఈ రెండు సినిమాలు హిందీలో వంద కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం ఆమెకు అంతులేని స్టార్ డమ్ ను తెచ్చిపెట్టాయి. మాములుగానే కోట్లలో తీసుకొనే ఆమె రెమ్యూనరేషన్ కూడా పెరిగిపోయింది. అయితే.. అల్లు అరవింద్-మధు మంతెన అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న “రామాయణం” సినిమాలోని సీత పాత్ర కోసం శ్రద్ధకపూర్ ను సంప్రదించారట. అయితే.. ఆమెతో ఆల్రెడీ “చిచోరే” చిత్రానికి వర్క్ చేసి ఉన్న దర్శకుడు నితీష్ తివారీ మాత్రం ఎందుకో పెద్దగా ఆసక్తి చూపలేదట. దాంతో శ్రద్ధాకపూర్ ను సీత పాత్ర కోసం సెలక్ట్ చేయాలా లేదా అనే కన్ఫ్యూజన్ లో ఉన్న నిర్మాతలకు క్లారిటీ ఇచ్చేసింది శ్రద్ధా.

అదేమిటంటే.. తాను సీత పాత్ర పోషించలేనని.. అందుకు కారణం ప్రొజెక్ట్ భారీది అవ్వడమే కాక, తాను ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అన్నీ డేట్స్ ను కేటాయించలేనని తేల్చేసింది శ్రద్ధాకపూర్. దాంతో ఇప్పుడు దర్శకనిర్మాతలు ఇప్పుడు సీత పాత్ర కోసం ఎవర్ని సెలక్ట్ చేయాలా అనే ఆలోచనలో పడ్డారు. ఈ ప్రొజెక్ట్ లో రాముడిగా హృతిక్ రోషన్, రావణుడిగా ప్రభాస్ నటిస్తారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus