బాలీవుడ్ యంగ్ హీరోలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే రాజ్ కుమార్ రావు, పత్రలేఖ వివాహం చేసుకోగా.. ఈరోజు విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. త్వరలోనే రణబీర్ కపూర్-అలియా భట్ కూడా ఒకటి కాబోతున్నారు. ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీ కూడా పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ శ్రద్ధాకపూర్. కొంతకాలంగా సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో ప్రేమాయణం సాగిస్తోంది శ్రద్ధా కపూర్.
అంతేకాకుండా.. శ్రద్ధా కపూర్ కజిన్ పెళ్లిలో రోహన్ సందడి చేసిన ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో శ్రద్ధా, రోహన్ నిజంగానే డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇప్పుడు శ్రద్ధా కపూర్ పెళ్లిపై సీనియర్ నటి, ఆమె బంధువు పద్మిని కొల్హాపురి తాజాగా ఓ హింట్ ఇచ్చింది. పద్మిని కొల్హాపురి గతంలో తను పాడిన పాటను మళ్లీ రీక్రియేట్ చేసింది. ఈ పాటను శ్రద్ధా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
ఈ పోస్ట్ పై స్పందించిన పద్మిని.. ‘నీ పెళ్లిలో ఈ పాటనే పాడతాను’ అని కామెంట్ పెట్టింది. దీంతో శ్రద్ధా పెళ్లి త్వరలోనే ఉండబోతుందంటూ ఆమె ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. బాలీవుడ్ లో పలు హిట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ‘సాహో’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!